- Advertisement -
హైదరాబాద్: ఎఐసిసి అధ్యక్ష ఎన్నికల వేళ గాంధీ భవన్ వద్ద టిపిసిసి మాజీ ప్రెసిడెంట్ పొన్నాల లక్ష్మయ్య గరంగరం అయ్యారు. శ్రీనివాస్ రెడ్డి ఓటు వేసేందుకు ఎన్నికల సిబ్బంది నిరాకరించారు. శ్రీనివాస్‌రెడ్డి స్థానాంలో కొమ్మూరి ప్రతాప్‌కు ఓటు ఇవ్వడంపై రగడ నెలకొంది. కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి ఓటు ఇవ్వడంపై పొన్నాల అభ్యంతరం వ్యక్తం చేశారు. జనగామ నుంచి పొన్నాలతో పాటు శ్రీనివాసరెడ్డికి ఎఐసిసి ఐడి కార్డు ఇచ్చింది. 45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందని పొన్నాల విమర్శించారు. పొన్నాలను కాంగ్రెస్ నేత జానారెడ్డి సముదాయించారు. ప్రతి నియోజకవర్గంలో ఇద్దరికి మాత్రమే ఓటింగ్‌కు అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి
‘వల’సలసల
జూటా బిజెపి జుమ్లా హామీలు
ఆహార భద్రత ఏది?
కారును పోలిన గుర్తులపై న్యాయ పోరు
- Advertisement -