న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ చేపట్టిన భారత్ జోడో యాత్ర అక్టోబర్ 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుందని, నవంబర్ 7 వరకు కొనసాగుతుందని తెలంగాణ ఏఐసిసి ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ తెలిపారు. సోమవారం ఒక ట్వీట్‌లో, భారత్ జోడోయాత్రకు మేము సిద్ధంగా ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర యాత్ర వివరాలను పంచుకోవడం సంతోషంగా ఉంది. అక్టోబరు 23న మా నాయకుడు రాహుల్ గాంధీకి మేము స్వాగతం పలుకుతాము, ఆయన నవంబర్ 7 వరకు తెలంగాణలో యాత్ర నిర్వహిస్తారు. ఇదిలావుండగా ఠాగూర్ ట్విట్టర్ హ్యాండిల్‌లో అందించిన వివరాల ప్రకారం, దీపావళి కారణంగా అక్టోబర్ 24, 25 మరియు 26 తేదీల్లో యాత్రకు విరామం ఉంటుంది. అక్టోబర్ 27న మక్తల్‌లో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ నవంబర్ 11న హైదరాబాద్ నగరంలోకి ప్రవేశిస్తారు.
Congress @INCIndia leader @RahulGandhi 's #BharatJodoYara will enter #Telangana on October 23 at Gudebellur, Narayanpet district. After a three-day break for #Diwali2022 , he will resume the yatra on October 27 at Makthal.https://t.co/zl9ce0Zy6s
— Deccan Chronicle (@DeccanChronicle) October 18, 2022
LIVE: Bharat Jodo Yatra | Halaharvi bus stop to Chagi village | Kurnool | Andhra Pradesh https://t.co/gMfI081kyF
— Rahul Gandhi (@RahulGandhi) October 18, 2022