- Advertisement -
విశాఖపట్నం న్యూస్: విశాఖ ఘటనపై హైకోర్టులో జనసేనకు చుక్కెదురయ్యింది. విశాఖ ఎయిర్ పోర్టు ఘటనపై హైకోర్టులో విచారణ జరిగింది. జనసేన నాయకులపై నమోదైన ఎఫ్ఐఆర్ రద్దు చేసేందుకు న్యాయస్థానం నిరాకరించింది. నిందితుడు కాని మూడో వ్యక్తి ఎలా సవాలు చేస్తారని ప్రశ్నించింది. హైకోర్టులో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. విశాఖ విమానాశ్రయం వద్ద వైసిపి మంత్రులు, వైసిపి నాయకులపై జనసేన కార్యకర్తలు రాళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే.
- Advertisement -