చౌటుప్పల్: మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంది. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని 2వ, 3వ వార్డులలో ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహించారు. 2వ వార్డు లో ప్లోరైడ్ బారిన పడి కాలు వంకర పోయిన గంగయ్యను పరామర్శించారు. అనంతరం పక్షపాతంతో బాధ పడుతున్న నర్సింహ గౌడ్ తో తన అనుభవాలను వివరించారు. బిజెపి పార్టీ వాళ్ళు పగటి దొంగలుగా పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల వల్ల ఎంతో మంది బాగు పడుతున్నారన్నారు. అలాగే అనారోగ్యంతో బాధ పడుతున్న అంజయ్య గౌడ్ అనే గీత కార్మికుడిని ఇంటికెళ్ళి పరామర్శించారు. మంత్రి తన ప్రచారంలో బాగంగా లింగోజీ గూడెం మాజీ సర్పంచ్ బండారు రాంరెడ్డి గారి ఇంటికెళ్ళి కలసి మద్దతు కోరారు. టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధిని వివరించారు.
అనంతరం 2, 3 వ వార్డు లలో మంత్రి ఇంటిఇంటికి వెళ్లి ప్రచారం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను గుర్తించి ఇంటిఇంటికీ వెళ్లి కలసి సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ స్వామి గౌడ్, 2వ , 3వ వార్డుల అధ్యక్షులు బొంగు నగేష్ గౌడ్, వలందాసు సతీష్ గౌడ్, ఎడ్ల మహేశ్వర రెడ్డి, కొయ్యలగుడెం వెంకటేష్, క్రాంతి, అశోక్, తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో భాగంగా 2వ, 3వ వార్డ్ లింగోజీ గూడం, తాళ్ళ సింగారం లో పలువురు మహిళలు, గ్రామస్తులను కలసి టిఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని వివరించారు. దళిత బంధు పథకం వల్ల దళితుల జీవితాల్లో వెలుగులు నిండుతాయన్నారు. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మంత్రి కోరారు. అనంతరం 2వ, 3వ వార్డు లోని ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ప్రచార సరళి, ఓటర్ లను కలసి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని, సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరించాలని కోరారు.