లండన్: శ్రీలంక రచయిత షెహన్ కరుణతిలక 2002 సంవత్సరానికి సాహిత్యంలో నోబెల్ పురస్కారంతో సమానమైనదిగా భావించే బుకర్స్ ప్రైజ్‌ను గెలుచుకున్నారు.‘ ది సెవన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మెదా’ అనే నవలకు గాను ఆయనకు ఈ అవార్డు దక్కింది. మానవత్వ లోతుల గురించి ఆ నవలలో చాలా విపులంగా రాసినట్లు జడ్జిలు పేర్కొన్నారు. కరుణ తిలక వయసు 47 ఏళ్లు. బుకర్స్ ప్రైజ్ గెలిచిన రెండవ శ్రీలంక రచయిత ఆయన.1992లో ‘ ఇంగ్లీష్ పేషెంట్’ నవల రాసిన మైకేల్ ఒండాజే తొలిసారి ఈ అవార్డును దక్కించుకున్నారు. ఓ ఫొటోగ్రాఫర్ కథే ‘ది సెవన్ మూన్స్ ఆఫ్ మాలి అల్మెదా’ .1990 దశకంలో శ్రీలంకలో జరిగిన యుద్ధ నేరాల గురించి ఈ నవలలో ని పాత్రలతో చెప్పించారు.
జీవితం, మరణానికి సంబంధించిన సత్యాలను రచయిత చాలా సాహసోపేతంగా రచయిత తన నవలలో రాసినట్లు జడ్జిలు తెలిపారు. యుద్ధ నేరాలకు చెందిన ఫొటోలతో ఆ దేశాన్ని మేల్కొలిపిన తీరు ఆ కథలో ఉన్నట్లు బుకర్స్ కమిటీ అభిప్రాయపడింది. శ్రీలంకలో సాగిన అకృత్యాలను సెటైర్ రూపంలోనూ ఆ నవలలో చిత్రీకరించారు.1975లో గాలెలో జన్మించిన కరుణ తిలక కొలంబోలో పెరిగారు. నిస్సహాయ స్థితిలో ఉన్న పరిస్థితిపై జోకులు వేయడం శ్రీలంకన్ల ప్రత్యేకమని కరుణతిలక పేర్కొన్నారు. మరనః తర్వాత జరిగిన సంఘటనలతో ఫొటోగ్రాఫర్ మీలి అల్మెదా ఎలా యుద్ధ నేరాలను బయటపెడతారనే విషయాన్ని రచయిత చాలా థ్రిల్లింగ్‌గా చెప్పినట్లు బుకర్స్ కమిటీ జడ్జిలు తెలిపారు. 2011లో ఆయన రాసిన తొలి నవల ‘చైనా మ్యాన్’కు కామన్వెల్త్ ప్రైజ్ వచ్చింది. సోమవారం రాత్రి లండన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కరుణ తిలకకు గత ఏడాది బుకర్స్ ప్రైజ్ విజేత డామన్ గాల్గుట్ 50,000 పౌండ్ల నగదుతో పాటుగా కొత్తగా డిజైన్ చేసిన ట్రోఫీని అందజేశారు. అలాగే ఈ ప్రైజ్ కోసం షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి రచయితకూ 2,500 పౌండ్లు అందజేశారు.
Sri Lankan Author Karunatilaka gets Booker prize