Monday, December 23, 2024

మార్కెట్లో నడిరోడ్డుపై యువకుడిని వేటకొడవళ్లతో నరికి….

- Advertisement -
- Advertisement -

Brutal murder in Andhra Pradesh

గుంటూరు న్యూస్: మార్కెట్‌లో నడిరోడ్డుపై ఓ యువకుడిని వేటకోడవళ్లతో నరికిచంపిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు  జిల్లా కేంద్రంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. నల్ల చెరువు ఆరోలైన్ వీధికి చెందిన దొడ్డి రమేష్(38) పైనాన్స్ వ్యాపారంతోపాటు పెళ్లిలకు డెకరేషన్ చేస్తుంటాడు. ఎస్‌సి సామాజిక వర్గానికి చెందిన రమేష్ ఓ కేసులో నిందితుడిగా ఉండడంతో అతడిపై పోలీసులు రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఎవరో ఫోన్ చేయడంతో రమేష్ పట్నం బజార్‌కు వెళ్లాడని అతడి భార్య తెలిపింది. అక్కడ కాపుకాసిన ముఠా సభ్యులు నడిరోడ్డుపై అతడిని వేటకోడవళ్లతో తరిమారు. రమేష్ షాపులోకి వెళ్లి దాక్కున్న కత్తులు, వేటకొడవళ్లతో దుండగులు అతడిని నరికి చంపారు. మార్కెట్‌కు వచ్చిన ప్రజలు భయంతో పరుగులు తీశారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తన భర్తను రౌడీషీటర్ ఆర్‌కె చంపాడని రమేష్ భార్య ఆరోపణలు చేసింది. తన భర్తకు ప్రాణాపాయం ఉందని మొరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోలేదని వాపోయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News