Friday, November 15, 2024

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడిస్తాం: విహెచ్ పి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఇటీవల నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామినేషన్ సందర్భంగా హిందు మహిళలను అవమానపరిచే విధంగా వ్యవహరించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు డిమాండ్ చేశారు. మహిళల తాళిబొట్టు, చేవి రింగులు, ముక్కుపుడకలు, గాజులు, కాళ్ల పట్టీలు అన్ని తీసివేసి లోపలికి అనుమతించారన్నారు. అదే విధంగా ముస్లింలకు ఎటువంటి నిబంధన ఎందుకు విధించలేదని ప్రశ్నించారు. హిజాబులు.. బుర్కాలు ధరించి వెళ్లినా కనీసం నామమాత్రంగా కూడా తనిఖీ చేయలేదన్నారు. హిందువులపై ఇంతటి వివక్షను ఖండిస్తూ టిఎస్పిఎస్సి  చైర్మన్ కలుద్దామని విశ్వహిందూ పరిషత్ నాయకులు నిర్ణయించుకున్నారు. అయితే అపాయింట్మెంట్ ఇచ్చేందుకు చైర్మన్, సెక్రటరీ నిరాకరించడంతో బుధవారం టిఎస్పిఎస్ ఆఫీసు ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ నాయకులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News