Friday, October 18, 2024

అప్పుడు బూరకు ఆత్మగౌరవం తెలియదా?: పద్మారావు

- Advertisement -
- Advertisement -

Padma Rao Goud

హైదరాబాద్: ఎంపిగా ఉన్నప్పుడు ఆత్మగౌరవం లేదని బూర నర్సయ్యకు తెలియదా? అప్పుడే రాజీనామా చేసి వెళ్లొచ్చు కదా? డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రశ్నించారు. సికింద్రాబాద్ లోని సీతాఫల్ మండి మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ లో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు. తాను ఆత్మ సంతృప్తితో ఉన్నానని సికింద్రాబాద్ లో ఉంటానని స్పష్టం చేశారు. బిజెపి నుంచి తనని ఎవరు సంప్రదించలేదని, తాను ఏ పార్టీ లోకి వెళ్లాల్సిన అవసరం తనకు లేదన్నారు.  కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి తన కూతురు వివాహానికి ఆహ్వానించానని, పెళ్లికి రాలేకపోయారు కాబట్టి తన ఇంటికి కిషన్ రెడ్డి వచ్చారన్నారు.

కిషన్ రెడ్డితో తనకు వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయని, తనని హైకమాండ్ ఆదేశిస్తే జపాన్ లో కూడా పోటీ చేస్తానని పద్మారావు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ అసెంబ్లీ నుంచి మళ్ళీ తానే పోటీ చేస్తానని చెప్పారు. మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందన్నారు. కేంద్రం నుంచి తన నియోజకవర్గానికి ఎలాంటి నిధులు రాలేదన్నారు. గవర్నర్ బిల్లులు ఆమోదించక తప్పదని, కొన్ని ఫైల్స్ తొందరగా రావన్నారు. నిర్ణయాలు అవసరాలకు అనుగుణంగా వస్తాయని, తాము తెలంగాణలో ఉన్నామని, గవర్నర్ పాకిస్తాన్ లో లేదు కదా? అని పద్మారావు ప్రశ్నించారు. తన రాజకీయ వారసుడు రామేశ్వర్ అని అంటున్నారని, కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News