కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితే బాగుంటుందని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి మూడు రాజధానుల నిర్ణయం సరైనది కాదన్నారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ ఏపీలో పర్యటిస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులు తనను కలిశారని, వారికి పూర్తి సహకారం అందజేస్తున్నట్లు రాహుల్ గాంధీ తెలిపారు. పోలవరం ప్రాజెక్టుతోపాటు రాష్ట్ర విభజన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. రాష్ట్ర విభజనపై ఇప్పుడు చర్చ అనవసరమని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వైఎస్సార్‌సీపీ మద్దతు తీసుకుంటుందా అనే ప్రశ్నకు రాహుల్ సమాధానమిస్తూ, పొత్తులపై పార్టీ అధ్యక్షుడు నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందన్న ఆరోపణలపై రాహుల్ గాంధీ స్పందిస్తూ, ఎన్నికల అథారిటీ చైర్మన్ మధుసూదన్ మిస్త్రీ మార్గదర్శకత్వంలో ఎన్నికలు జరిగాయని, శశి థరూర్, అతని అనుచరులు లేవనెత్తిన ఫిర్యాదుపై విచారణ చేస్తానని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఎపికి రాజధాని అమరావతి మాత్రమే: రాహుల్ గాంధీ
- Advertisement -
- Advertisement -
- Advertisement -