ఇనుపరాడ్‌తో చిత్రహింసలు…. ఐదుగురు నిందితుల్లో నలుగురు అరెస్టు
గాజియాబాద్ : బస్సుకోసం బస్టాండ్‌లో వేచి చూస్తున్న ఓ మహిళ ను కిడ్నాప్ చేసిన ఐదుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆప్ ఇనుపరాడ్లతో చిత్రహింసలకు గురిచేశారు. రెండురోజులు తరువాత రోడ్డుపక్కన పడేసి వెళ్లారు. ప్రస్తుతం ఆ బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లోని గాజియాబాద్‌లో జరిగింది. గ్యాంగ్ రేప్‌కు పాల్పడిన దుండగులు బాధితురాలికి తెలిసిన వారే కావటం గమనార్హం. నలుగురిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇనుపరాడ్ ఇంకా మహిళ మర్మాంగం లోనే ఉందని ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందంటూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మాలివాల్ ట్వీట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గాజియాబాద్‌లో బంధువుల ఇంటిలో బర్త్‌డే పార్టీకి హాజరై ఢిల్లీకి తిరుగుప్రయాణమైన బాధితురాలిని, ఆమె సోదరుడు బస్టాండ్‌లో దింపి వెళ్లాడు. బస్సు కోసం వేచి చూస్తుండగా ఐదుగురు కారులో అక్కడికి వచ్చి బలవంతంగా ఆమెను తీసుకెళ్లారు. గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
బాధితురాలికి, నిందితులకు మధ్య ఆస్తి విషయంలో తగాదాలు ఉన్నాయని, ప్రస్తుతం ఆ వివాదం కోర్టులో ఉందని గాజియాబాద్ ఎస్పీ నిపుణ్ అగర్వాల్ తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ఆశ్రమ్ రోడ్డులో ఓ మహిళ రక్తపు మడుగులో పడి ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందగా, వెంటనే బాధితురాలిని జీటీబీ ఆస్పత్రికి తరలించారు. ఫిర్యాదు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గాజియాబాద్ ఘటనపై పూర్తి వివరాలు అందించాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ శ్వాతి మలివాల్ ఎస్పీని కోరారు. “ ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్డుతో మహిళ రక్తపు మడుగులో ప్రాణాలతో పోరాడుతూ కనిపించింది. ఆమె పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. గాజియాబాద్ నుంచి ఢిల్లీకి వస్తున్న క్రమంలో కారులో బలవంతంగా తీసుకెళ్లారు. రెండు రోజుల పాటు ఆమెపై ఐదుగురు అత్యాచారం చేశారు. ప్రైవేట్ భాగాల్లో ఇనుపరాడ్‌ను చొప్పించారు. రోడ్డు పక్కన పడిపోయి ఉన్న సమయంలో నూ ఇనుపరాడ్ అలాగే ఉంది. ఆస్పత్రిలో ప్రాణాల కోసం పోరాడుతోంది. గాజియాబాద్ ఎస్‌ఎస్‌పికి నోటీసులు పంపించాం అని శ్వాతి ట్వీట్ చేశారు. .