Monday, December 23, 2024

బంజారాహిల్స్ లైంగికదాడి ఘటనపై మంత్రి సీరియస్

- Advertisement -
- Advertisement -

Banjara Hills sexual assault incident

హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని డిఎవి పబ్లిక్ స్కూల్లో నాలుగున్నరేళ్ళ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనపై గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ సీరియస్ అయ్యారు. డిఎవి పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్, కార్ డ్రైవర్ రజని కుమార్ పై కఠిన చర్యలు చేపట్టాలంటూ పోలీసు అధికారులను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ సిబ్బంది, యాజమాన్యంపై చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కాగా నిందితుడిని అరెస్టు చేసి 376 ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. స్కూల్ ఇంచార్జి, టీచర్ నిర్లక్షం కారణంగానే ఘటన చోటుచేసుకుందని దీంతో ఆమెపై కూడ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News