Friday, November 22, 2024

దీపావళి రోజు టపాసులపై నిషేధం.. ఉల్లంఘిస్తే 6 నెలల జైలు శిక్ష

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దీపావళి పండుగ నాడు బాణసంచా కాలిస్తే ఆరు నెలల జైలు శిక్ష, రూ. 200 జరిమానా విధిస్తామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంంత్రి గోపాల్ రాయ్ బుధవారం ప్రకటించారు. టపాసుల తయారీ, నిల్వ, అమ్మకాలు ఢిల్లీలో నిషిద్ధమని, ఉల్లంఘించిన వారికి రూ. 5,000 జరిమానా, మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని విలేకరుల సమావేశంలో ఆయన తెలిపారు. గత రెండేళ్లుగా ఢిల్లీలో టపాసుల తయారీ, నిల్వ చేయడం, అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం నిషేధం అమలు చేస్తోంది. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ వరకు వీటిపై సంపూర్ణ నిషేధం విధిస్తూ సెప్టెంబర్‌లో తిరిగి ఉత్తర్వులను ప్రభుత్వం జారీచేసింది. ఈ నెల 21వ తేదీ నుంచి దీపాలు వెలిగించండి..టపాసులు కాదు పేరిట ప్రజా అవగాహన ప్రచారాన్ని ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. నిషేధాన్ని అమలు చేసేందుకు 408 బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.

Firecrackers banned on Diwali in Delhi

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News