Monday, December 23, 2024

పురపాలక శాఖ అధికారులకు మంత్రి కెటిఆర్ అభినందనలు

- Advertisement -
- Advertisement -

KTR Congrats Municipal Officials for World Green City Award

మన తెలంగాణ/హైదరాబాద్: రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ను ఆ శాఖ అధికారులు బుధవారం కలిశారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు లభించిన వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును, లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ రికవరీ అవార్డును కెటిఆర్‌కు అధికారులు చూపించారు. అనంతరం పురపాలక శాఖ అధికారులను కెటిఆర్ అభినందించారు. కెటిఆర్‌ను కలిసిన వారిలో అర్బన్ డెవలప్‌మెంట్ చీఫ్ స్పెషల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కూడా ఉన్నారు. పచ్చదనం పెంపుపై వరల్డ్ గ్రీన్ సిటి అవార్డుతో పాటు లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనమిక్ రికవరీ అండ్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ అవార్డునూ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ (ఎఐపిహెచ్) ఆధ్వర్యంలో దక్షిణ కొరియాలో నిర్వహించిన కార్యక్రమంలో హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును ప్రదానం చేశారు. నగరానికి విశ్వఖ్యాతి రావడానికి సిఎం కెసిఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంతో పాటు పచ్చదనం పెంపునకు తీసుకున్న చర్యలే ప్రధాన కారణం. భారత్ నుంచి ఈ పురస్కారం అందుకున్న ఒకే ఒక్క సిటీ మన హైదరాబాద్ కావడం విశేషం. మరో విభాగమైన లివింగ్ గ్రీన్ ఫర్ ఎకనామిక్ రికవరీ అండ్ ఇనక్లూజివ్ గ్రోత్‌లో మరో అవార్డును అందుకున్నది. నగర వాసులందరూ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి, అభివృద్ధి చెందడానికి వీలు కల్పించే వ్యవస్థలు, పరిష్కారాలను రూపొందించడంపై ఈ క్యాటగిరీ దృష్టి సారిస్తుంది. తెలంగాణ రాష్ట్రానికి గ్రీన్ నెక్లెస్‌గా పిలిచే ఒఆర్‌ఆర్ చుట్టూ పచ్చదనం పెంపుతో నగరం ఈ విభాగంలో ఉత్తమమైనది ఎంపికైంది.

KTR Congrats Municipal Officials for World Green City Award

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News