మనతెలంగాణ/హైదరాబాద్: గోదావరి నది పరివాహకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మూడు సాగునీటి పథకాలకు క్లియరెన్స్ ఇవ్వాలని నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.రజత్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్ కుమార్‌కు బుధవారం లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గోదావరి బేసిన్ పరిధిలో ఉన్న ఆరు పథకాలకు సంబంధించిన డిపిఆర్‌లను గత ఏడాది సెప్టెంబర్‌లోనే కేంద్ర జల సంఘానికి, గోదావరి నదీయాజమాన్య బోర్డుకు సమర్పించిందని తెలిపారు. ఇందులో మూడు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి ఇంకా క్లియరెన్స్ ఇవ్వాల్సివుందని లేఖ ద్వారా గుర్తు చేశారు. ఈ ఏడాది మార్చి నెలలో ఈ ప్రాజెక్టులకు సాంకేతిక పరమైన క్లియరెన్సులు రావాల్సివుందని గోదావరి బోర్డుకు తెలిపామన్నారు.
చనాకాకోరాట బ్యారేజి నిర్మాణం, చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల పథకం, ముక్తేశ్వకరం (చిన్నకాళేశ్వరం) ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన డిపిఆర్‌లకు క్లియరెన్స్ ఇవ్వాలని కోరారు. గోదావరి బోర్డు ఈ ఏడాది ఏప్రిల్ 27న నిర్వహించిన 13వ బోర్డు సమావేశంలో కూడా ఈ మూడు ప్రాజెక్టుల డిపిఆర్‌లను పరిశీలించమని కోరామన్నారు. టెక్నికల్ ఆడ్వైజర ఇకమిటి ద్వారా పరిశీలనలో ఉన్నట్టు తెలిపారన్నారు. ఈ మూడు ప్రాజెక్టులకు త్వరగా సాంకేతిక పరమైన క్లియరెన్స్‌లు ఇప్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ స్పెషల్ సీఎస్ రజత్ కుమార్ ఈ మేరకు కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
Ranjit Kumar seeks Centre for Clearance of 3 TS Projects