నాగర్‌కర్నూల్: ర్యాగింగ్ కారణంగా డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్‌కర్నూల్‌లో చోటుచేసుకుంది. హనుమాన్ తండాకు చెందిన 19 ఏళ్ల మైనా జడ్చర్లలోని డాక్టర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. బుధవారం ఉదయం పొలాల్లోకి వెళ్లి పురుగుమందు తాగి ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె నొప్పితో బాధపడుతుండటం గమనించిన కుటుంబసభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. తొలుత ఆమె ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. అయితే ర్యాగింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. మైనాను ఓ వ్యక్తి కొట్టినట్లు వీడియోలో చూపించారు. ఈ ఘటనపై విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని బాధితురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. గురువారం కళాశాల వద్ద నిరసనకు దిగారు. కాగా, ర్యాగింగ్ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు కాలేజీ యాజమాన్యం ప్రయత్నించినట్లు తెలిసింది. ఐదుగురు లెక్చరర్లు మైనాకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని ప్రిన్సిపాల్ కూడా ఆమెను బెదిరించినట్లు తెలుస్తోంది.
కాలేజీలో ర్యాగింగ్… మనస్థాపంతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -
- Advertisement -