- Advertisement -
లక్నో : ఉత్తరప్రదేశ్‌లో త్వరలో ఇంజనీరింగ్, ఎంబిబిఎస్ కోర్సులను హిందీలో కూడా బోధిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ గురువారం ఈ విషయాన్ని ట్వీటు ద్వారా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా దేశంలోనే తొలిసారిగా హిందీలో ఎంబిబిఎస్ కోర్సుల పుస్తకాన్ని విడుదల చేశారు. హిందీలో వైద్య విద్యాభ్యాసానికి అవకాశాలు కల్పించడం ద్వారా ప్రతిభావంతులైన గ్రామీణ యువత మరింతగా రాణించేందుకు వీలేర్పడుతుందని బిజెపి ప్రభుత్వం భావిస్తోంది. యుపిలోనూ హిందీలో వైద్య విద్యాభ్యాసానికి ప్రాధాన్యతను ఇస్తామని, ఈ దిశలో సంబంధిత పుస్తకాల అనువాద ప్రక్రియ ఇప్పటికే ఆరంభం అయిందని సిఎం ఆదిత్యానాథ్ తెలిపారు.
- Advertisement -