Saturday, April 5, 2025

జిమ్‌లకు సైకిళ్లు… ఎసితో బ్లాంకెట్లా

- Advertisement -
- Advertisement -

Want to Sit in AC But with Blanket: PM Modi

మారితే హితమన్న ప్రధాని మోడీ

న్యూఢిల్లీ : పర్యావరణ హిత జీవనవిధానం అంతర్లీన సూత్రంగా మిషన్ లైఫ్‌ను ప్రారంభించిన దశలో ప్రధాని మోడీ ఆధునిక ప్రపంచంలో మనిషి జీవన విధానాలు కొన్ని తెలియకుండానే పర్యావరణాన్ని దెబ్బతీస్తాయని చెపుతూ కొందరు ఎసిని 17 డిగ్రీలు కూల్‌గా పెట్టుకుని బ్లాంకెట్ కప్పేసుకుని పడుకుంటారని, చాలా మంది జిమ్‌లకు కారుల్లో వెళ్లుతుంటారని తెలిపారు. ఎసి ఉష్ణోగ్రతను తగ్గించడం వల్ల వాతావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక వ్యాయామానికి కారులలో జిమ్‌కు వెళ్లేవారు ఈ క్రమంలో పెట్రోలు వాడకం గురించి ఆలోచించడం లేదన్నారు. జిమ్‌కు పోవడం ఆరోగ్యానికి అనుకుంటే వారు సైకిల్‌పైనో నడిచో వెళ్లితే అటు ఇంధన పరిరక్షణ జరుగుతుంది. వారికి కావల్సిన వ్యాయామం కూడా ఉంటుందని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇప్పటి మిషన్ లైఫ్ పి3 ప్రాతిపదికన సాగుతుందని తెలిపారు. ప్రో ప్లానెట్ పీపుల్ (పిపిపి)గా దీనిని పేర్కొన్నారు. ప్రజలను భౌగోళిక అనుకూలం చేయడం ఈ పథకం ఉద్ధేశమన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News