హైదరాబాద్: వినియోగదారుల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను అందుకోవడంలో భాగంగా తమ రిటైల్ విస్తరణ వ్యూహానికి అనుగుణంగా హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ ఇటీవలనే మూడు కిచెన్ గ్యాలరీలను హైదరాబాద్‌లో ప్రారంభించింది. తద్వారా భారతదేశవ్యాప్తంగా తమ కిచెన్‌గ్యాలరీల సంఖ్యను 170కు తీసుకువెళ్లింది. ఈ కిచెన్ గ్యాలరీలు కంపెనీ యొక్క ప్రత్యేకమైన ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్స్. ఇక్కడ మొత్తం హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ సహా కిచెన్ అప్లయెన్సస్, వాటర్ హీటర్ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తారు. హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన ఈ నూతన ఎక్స్‌క్లూజివ్ స్టోర్లు కోకాపేట, మేడ్చల్, ట్రూప్ బజార్ ఏరియాల్లో ఉండటంతో పాటుగా ఈ ప్రాంతాల్లోని వినియోగదారులను చేరుకోనున్నాయి. ప్రస్తుతం, ఈ కంపెనీకి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా 1500 మంది రిటైలర్లతో కూడిన నెట్‌వర్క్ ఉండగా, వారిలో 250 మంది రిటైలర్లు తెలంగాణా నుంచి ఉన్నారు.
ఈ కిచెన్ గ్యాలరీలు వ్యూహాత్మక ప్రాంతాలలో ఉన్నాయి. ఇవి సంబంధిత నగరాల నుంచి వచ్చే డిమాండ్‌ను తీర్చడంతో పాటుగా హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సస్‌కు చెందిన అన్ని వినూత్నమైన, తాజా ఉత్పత్తులను కలిగి ఉంటాయి. వీటిలో విస్తృతశ్రేణిలో ఐఓటీ ఆధారిత ఉత్పత్తులను సైతం ప్రదర్శించనున్నారు. ఈ స్టోర్‌లలో కనిపించే ఉత్పత్తుల జాబితాలో చిమ్నీలు,హోబ్స్, కుక్‌టాప్స్, బిల్ట్ ఇన్ ఓవెన్స్, బిల్ట్ ఇన్ మైక్రోవేవ్, డిష్‌వాషర్, కిచెన్ సింక్స్, వాటర్‌ఫ్యూరిఫైయర్లు, ఫుడ్ శానిటైజర్లు, ఐఓటీ అప్లయెన్సస్ అయిన వాటర్ ప్యూరిఫైయర్లు, వాటర్ హీటర్లు, కిచెన్ చిమ్నీలు వంటివి ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటుగా ఇటీవలి కాలంలో కిచెన్ గ్యాలరీలను తెరిచిన ఇతర నగరాలలో లక్నో, లుథియానా,ఘజియాబాద్, అల్వార్, కోల్‌కతా, ముంబై, భోపాల్, గ్వాలియర్, నాసిక్, మంగళూరు వంటివి ఉన్నాయి. ఇవి భౌగోళికంగా దేశవ్యాప్తంగా కార్యకలాపాలను వృద్ధి చేయాలనే కంపెనీ నిబద్ధతను ప్రతిబింబిస్తాయి.
హైదరాబాద్‌లో కిచెన్ గ్యాలరీయాలను ప్రారంభించడం గురించి శ్రీ రాకేష్ కౌల్, సీఈఓ – హోల్‌టైమ్ డైరెక్టర్, హింద్‌వేర్ హోమ్ ఇన్నోవేషన్ లిమిటెడ్ మాట్లాడుతూ ‘‘మాకు అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌లలో హైదరాబాద్ ఒకటి. ఒకేసారి మూడు స్టోర్లను ఇక్కడ ప్రారంభించడం పట్ల ఆనందంగా ఉన్నాము. హైదరాబాద్‌లో వివేకవంతులైన వినియోగదారులు నిశ్శబ్ద చిమ్నీలు మరియు సన్నటి కుక్‌టాప్‌లను అమితంగా ఇష్టపడుతున్నారు. ఈ మార్కెట్‌లో వృద్ధికి అసాధారణ అవకాశాలు ఉన్నాయి. ఈ హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లను మూడింటిని ఇక్కడ ప్రారంభించడం వల్ల ఈ ప్రాంతంలో మా మొత్తం స్టోర్ల సంఖ్య 20కు చేరింది. ఈ మార్కెట్‌లో మేము స్ధిరంగా పెట్టుబడులు పెట్టనున్నాము మరియు సాటిలేని రీతిలో వినియోగదారుల అనుభవాలనూ అందించనున్నాము’’ అని అన్నారు.
ఆయనే మరింతగా మాట్లాడుతూ.. ‘‘మా అవిశ్రాంత ఆవిష్కరణలు మమ్మల్ని అందరికంటే ముందుంచాయి. అంతేకాదు, కిచెన్ చిమ్నీ విభాగంలో నెంబర్ 2 స్ధానంలో నిలిచేందుకు సైతం తోడ్పడ్డాయి. అంతేకాదు, మేము కీలకమార్కెట్‌ల వ్యాప్తంగా మ స్టోర్‌ల సంఖ్యను మరింతగా పెంచేందుకు ప్రణాళిక చేశాము. గురుగ్రామ్, ముంబై, కోల్‌కతా తదితర నగరాల్లో 30 స్టోర్లను అదనంగా జోడించనున్నాము. ఇది మా ఆఫ్‌లైన్ చేరికను మరింతగా పెంచడంతో పాటుగా భారతదేశవ్యాప్తంగా హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సస్ లభ్యతను సైతం పెంచనుంది’’అని అన్నారు. ఈ ఎక్స్‌క్లూజివ్ స్టోర్లతో పాటుగా ఈ కంపెనీకి శక్తివంతమైన పంపిణీ నెట్‌వర్క్ సైతం 1300మంది డిస్ట్రిబ్యూటర్లు, 13000 మంది రిటైలర్లతో దేశవ్యాప్తంగా ఉంది. సుప్రసిద్ధ ఈ–కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో బలంగా ఇది ఉనికిని చాటుతుంది.