- Advertisement -
అమరావతి: కడప జిల్లా స్పిరిట్ కాలేజీ దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు బైకులు ఢీకొని జరిగిన ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రున్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతులను నిత్యసాయి, శంకర్, జాఫర్ గా గుర్తించారు. స్థానికుల సమాచాంరతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.
- Advertisement -