- Advertisement -
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధిక సంక్షేమ పథకాల అమలు అవుతున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంత్రి తలసాని శుక్రవారం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ మేనమామ లాగా పేదింటి ఆడపడుచు పెండ్లికి ఒక లక్ష 116 రూపాయల ఆర్ధిక సహాయం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో ఈ విధమైన ఆర్ధిక సహాయం ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. ఆసరా పెన్షన్, రైతు బంధు, రైతు భీమా, కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా అనేక కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోందని తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు.
- Advertisement -