Monday, December 23, 2024

పవన్ కళ్యాణ్‌కు ఎపి మహిళా కమిషన్ నోటీసులు

- Advertisement -
- Advertisement -

AP Women Commission notices to Pawan Kalyan

అమరావతి: మూడు పెళ్లిళ్లపై చేసిన వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఆంధ్రప్రదేశ్‌ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసి, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేసింది. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని, తన మాటలను ఉపసంహరించుకోవాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. మూడు పెళ్లిళ్లపై పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు సమాజంలో దుమారం రేపాయని ఆమె అన్నారు. భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని.. మీరు ఇస్తూ మాట్లాడిన తీరుతో మహిళా లోకం షాక్‌కు గురైందని తెలిపారు. మహిళలను ఉద్దేశించి స్టెప్నీని ఉపయోగించడం చాలా అభ్యంతరకరమన్నారు. మీ మాటల్లోని తప్పును తెలుసుకుని సంజాయిషీ ఇస్తారని ఆశించామన్నారు. ఎవరి జీవితంలో అయినా మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వస్తే అది కచ్చితంగా వ్యతిరేకమేనని స్పష్టం చేశారు.

 

AP Women Commission notices to Pawan Kalyan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News