లిజ్ ట్రస్ స్థానంలో బ్రిటన్ ప్రధాని పదవిని మరోసారి బోరిస్ జాన్సన్‌ను అధిష్ఠించనున్నారని ప్రీతిపటేల్ అన్నారు. ప్రీతి మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ కేబినెట్‌లోబ్రిటిష్ సెక్రటరీగా సేవలందించారు. ప్రీతి శనివారం మాట్లాడుతూ.. తమ మాజీ బాస్ జాన్సన్ ప్రధాని ట్రస్ స్థానాన్ని భర్తీ చేయనున్నారని తెలిపారు. భారత సంతతికి చెందిన ప్రీతిపటేల్ గత పోటీలో కన్జర్వేటివ్ పార్టీ నేతగా ట్రస్, సునాక్ ఇద్దరిలో ఎవరికి మద్దతు ఇచ్చారనేది వెల్లడించలేదు. బోరిస్ జాన్సన్ 2019 సార్వత్రిక ఎన్నికల్లోప్రజాభిష్టం మేరకు టోరీ తరఫున ప్రధానమంత్రి అయ్యారని క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయం తీసుకుని బోరిస్ జాన్సన్ తనను తాను నిరూపించుకున్నారని ఈ మేరకు ఆయనకు మంచి ట్రాక్ రికార్డు ఉందని 50ఏళ్ల పొలిటీషియన్ ప్రీతిపటేల్ ట్విటర్ వేదికగా తెలిపారు. కాగా కొవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో బోరిస్ జాన్సన్ లాక్‌డౌన్ చట్టాన్ని విందు కార్యక్రమాల్లో పాల్గొనడం తావిచ్చింది. ప్రధాని రేసులో బోరిస్ జాన్సన్‌కు తను మద్దతు ఇస్తున్నట్లు ప్రీతిపటేల్ ట్విటర్ వేదికగా స్పష్టం చేశారు.
Boris Johnson return as UK PM again?