Friday, November 22, 2024

ఇబ్రహీంపట్నంలో భారీగా నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

Rs 64.63 lakh seized at Ibrahimpatnam

ఇబ్రహీంపట్నంలో భారీగా నగదు పట్టివేత
రూ.64.63 లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
పంతంగి టోల్‌ప్లాజా వద్ద కారులో రూ.20 లక్షలు నగదు పట్టివేత
మన తెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. ఇబ్రహీంపట్నం-సాగర్ హైవేపై తనిఖీలు చేపట్టిన ఎస్‌వోటీ పోలీసులు ఓ కారులో తరలిస్తున్న రూ. 64.63 లక్షల రూపాయల నగదును సీజ్ చేశారు. కారులో ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కారును పోలీసు స్టేషన్‌కు తరలించారు. కారులో పట్టుబడిన డబ్బును ఎక్కడి నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే ఎస్‌వోటీ పోలీసులు పక్కా సమాచారంతోనే కారును పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే, మునుగోడు నియోజకవర్గ పరిధిలో పలు చోట్ల చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి ఓ వైపు తనిఖీలు కొనసాగిస్తూనే.. మరోవైపు పతంగి టోల్ ప్లాజా వద్ద సైతం మోహరించారు. నల్గొండ జిల్లా వైపు వెళ్లే అన్ని వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శనివారం యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ. 20 లక్షల పట్టుబడ్డాయి. తనిఖీల్లో భాగంగా పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారును చెక్ చేశారు. అందులో దాదాపు రూ. 20 లక్షలను గుర్తించారు. అయితే ఆ నగదుకు సంబందించి అతని వద్ద ఎలాంటి రశీదులు, ఆధారాలు లేకపోవడంతో పోలీసులు నగదును స్వాధీనం చేసుకున్నారు. కారులో డబ్బును తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ఇక, మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి కారులో తరలిస్తున్న కోటి రూపాయల నగదును పోలీసులు ఇటీవల స్వాధీనం చేసుకున్నారు. చల్మెడ సమీపంలోని చెక్‌పోస్టు వద్ద వాహన తనిఖీల్లో కరీంనగర్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్ భర్త ప్రయాణిస్తున్న కారులో నగదును పోలీసులు గుర్తించారు. నల్గొండ జిల్లాలో పోలీసులు ఏర్పాటు చేసిన డైనమిక్ టీమ్స్ తనిఖీల్లో భాగంగా కారులో నగదును గుర్తించారు. నల్గొండ పోలీసు సూపరింటెండెంట్ రెమా రాజేశ్వరి తెలిపిన వివరాల ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో చెల్మెడ చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసు బృందం టాటా సఫారీని ఆపారు. కారును కరీంనగర్‌కు చెందిన బిజెపి కార్పొరేటర్ వేణు నడుపుతున్నారు. పోలీసు బృందం అతని వాహనాన్ని తనిఖీ చేసి, కారు బూట్ తెరవమని కోరింది. అక్కడ కోటి నగదు నింపిన బ్యాగును పోలీసులు గుర్తించారు. డబ్బు గురించి పోలీసులు ప్రశ్నించినప్పుడు వేణు డబ్బు ఎక్కడికి తీసుకెళుతున్నారు అనే దాని గురించి సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వలేదు. ఖాతాలో లేని నగదు యొక్క మూలాన్ని వివరించడానికి అతను ఎటువంటి పత్రాలను అందించలేకపోయాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నారు.

Rs 64.63 lakh seized at Ibrahimpatnam

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News