Monday, December 23, 2024

బొమ్మ బ్లాక్‌బస్టర్

- Advertisement -
- Advertisement -

విజయీభవ ఆర్ట్ పతాకంపై నందు విజయకృష్ణ హీరోగా రష్మీ గౌతమ్ హీరోయిన్‌గా రాజ్ విరాట్‌ను దర్శకుడుగా పరిచయం చేస్తూ ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘బొమ్మ బ్లాక్‌బస్టర్’. ఈ చిత్రం విడుదలకు సిద్దమైన సందర్బంగా సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు మారుతి, డి.జె.టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ చేతులమీదుగా చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. అనంతరం చిత్ర దర్శకుడు రాజ్ కిరీటి మాట్లాడుతూ “ఇప్పటి వరకు విడుదలైన ఈ సినిమా పాటలకు, టీజర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. మంచి కంటెంట్‌తో వస్తున్న ఈ సినిమా అందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ పగడాల, బోసుబాబు నిడుమోలు, ఆనంద్ రెడ్డి మద్ది, మనోహర్ రెడ్డి యెడలు, నందు, రష్మిక గౌతమ్ తదితరులు పాల్గొన్నారు.

Bomma Blockbuster Movie Trailer Out

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News