Monday, December 23, 2024

బ్రిటన్ ప్రధాని రేసులో సునాక్ ముందంజ

- Advertisement -
- Advertisement -

Rishi Sunak to be next PM of UK?

బ్రిటన్ ప్రధాని రేసులో సునాక్ ముందంజ
100 మంది ఎంపిల మద్దతు
రేసులో ప్రధాని బోరిస్‌జాన్సన్
లండన్: సంతతికి చెందినబ్రిటన్ మాజీ చాన్సలర్ రిషి సునాక్ యుకె ప్రధాని రేసులో దూసుకుపోతున్నారు. ఆపద్ధర్మ ప్రధాని లిజ్ ట్రస్ స్థానాన్ని భర్తీ చేసేక్రమంలో సునాక్‌కు ప్రస్తుతం 100మంది ఎంపీల మద్దతు లభించిందని శనివారం ఆయన మద్దతుదారులు తెలిపారు. కన్జర్వేటివ్ పార్టీ నేత సునాక్ ప్రధానమంత్రి అయ్యేదిశగా తమ పార్టీ ఎంపీల మద్దతు కూడగట్టడంలో సత్ఫలితాలు పొందుతున్నారు. అయితే 42ఏళ్ల రిషి సునాక్‌కు మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ నుంచి పోటీ ఎదురుకానుంది. కరేబియన్ దీవుల్లో హాలీడేలో ఉన్న జాన్సన్ ప్రధానమంత్రి రేసులో ఉన్నారని కన్జర్వేటివ్ పార్టీ నేతలు తెలిపారు. కానీ ఇంతవరకు రిషిసునాక్, బోరిస్ జాన్సన్ తాము ప్రధానమంత్రి పదవికి పోటీపడుతున్నామని అధికారికంగా ప్రకటించలేదు. హౌస్ లీడర్ పెన్నీ మాత్రమే తను ప్రధాని పదవికి పోటీపడుతున్నట్లు ప్రకటించింది. మాజీ ఆర్థికమంత్రి సునాక్‌కు టోరీ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోందని ఆయన మద్దతుదారులు ప్రకటించారు. రిషి ప్రణాళికతో ఉన్నారు సరైనది అని తను భావిస్తున్నట్లు మాజీ డిప్యూటీ ప్రధానమంత్రి బిబిసికి తెలిపారు. ప్రస్తుత పరిస్థితిలో స్థిరత్వానికి సునాక్ సరైన అభ్యర్థిగా భావిస్తున్నాను అని రాబ్ తెలిపారు. యుకెలో ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న వ్యాపారస్థులు, వేలాదిమంది కార్మికులకు భరోసా కల్పించే వ్యక్తి రిషి సునాక్‌గా భావిస్తున్నట్లు రాబ్ మీడియాకు తెలిపారు. మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్‌ను పార్టీగేట్ స్కాండల్ వెంటాడే ప్రమాదం ఉందని రాబ్ హెచ్చరించారు. కాగా జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్‌లోని లాక్‌డౌన్ చట్టాన్ని విందు కార్యక్రమాల్ల్లో పాల్గొని హౌస్ కామన్స్‌ను తప్పుదారి పట్టించారని రావడంతో ప్రధాని పదవికి రాజీనామా చేశారు. పార్టీగేట్ స్కాండల్‌పై యుకె పార్లమెంటు విచారణ జరుపుతోంది. మరోవైపు రిపబ్లికన్ నుంచి జాన్సన్ తన భార్య, పిల్లలతో కలిసి లండన్‌కు విమానంలో తిరిగివచ్చిన ఫొటోను స్కైన్యూస్ ప్రచురించింది. బ్రిటన్ ప్రధాని నివాసం డౌనింగ్ స్ట్రీట్‌లోకి మళ్లీ ప్రవేశించాలని బోరిస్ జాన్సన్ భావిస్తున్నారని స్కైన్యూస్ తెలిపింది.

ప్రస్తుతం బోరిస్‌జాన్సన్ తిరిగి ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాలని ఎంపీలు బహిరంగంగా మద్దతు పలుకుతున్నారు. సోమవారం మధ్యాహ్నం ప్రధాని అభ్యర్థుల షార్ట్‌లిస్ట్ చేసేసమయానికి 100మంది ఎంపీల మద్దతు లభిస్తుందని ఆయన విధేయులు విశ్వసిస్తున్నారు. ఒకవేళ సోమవారం నాటికి ప్రధాని రేసులో ఒక్కరే ఉంటే విజేతను వచ్చే శుక్రవారం ప్రకటించనున్నారు. ప్రధాని రేసులో రిషి సునాక్, బోరిస్ జాన్సన్ ఓ ఒప్పందానికి వచ్చే అవకాశం ఉందని వారు మద్దతుదారులు విశ్వసిస్తున్నారు. అయితే ప్రధాని రేసులో ముందున్న సునాక్ మాజీ ప్రధాని జాన్సన్ ఇచ్చే ఎటువంటి ఆఫర్‌నైనా తిరస్కరించే అవకాశం ఉందని డైలీ టెలీగ్రాఫ్ నివేదించింది. ఏడాది జాన్సన్ ప్రభుత్వం నుంచి సునాక్ రాజీనామా చేసి వైదొలిగిన విషయాన్ని డైలీ టెలిగ్రాఫ్ చేసింది. ప్రస్తుత ప్రధాని లిజ్‌ట్రస్‌తో జరిగిన పోటీలో తొలిరౌండులో ముందున్న రిషి సునాక్ అనంతరం ఎంపీల విశ్వాసం పొందడంలో విఫలమయ్యారు. దీంతో ట్రస్ విజేతగా నిలిచి బ్రిటన్ ప్రధాని అయ్యారు. కానీట్రస్ సమర్థ పాలన అందించడంలో విఫలమై ప్రధాని పదవికి రాజీనామా చేశారు. లిజ్ ట్రస్ ప్రస్తుతం బ్రిటన్ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతున్నారు.

Rishi Sunak to be next PM of UK?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News