హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏఐసీసీ కార్యదర్శి తారీఖ్ అన్వర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి నోటీసులు జారీచేశారు. మునుగోడు ఉప ఎన్నికల బరిలో బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్న తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోమటిరెడ్డి చెప్పిన వాయిస్ రికార్డ్ వైరల్ అవుతోందని తారీఖ్ అన్వర్ పేర్కొన్నారు. మీ వైఖరి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. ఈ విషయమై కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఫోన్ కాల్‌పై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఏఐసీసీ క్రమశిక్షణ సంఘం ఆదేశించింది. లేనిపక్షంలో అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆడియో రికార్డింగ్‌పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ.. ఆ ఆడియో తాజాది కాదని అన్నారు. అయితే అది 2014 ఎన్నికల సమయంలో రికార్డ్ అయిందని ఆయన అన్నారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు
- Advertisement -
- Advertisement -
- Advertisement -