Monday, December 23, 2024

పాండ్యా ఆల్‌రౌండ్ షో..

- Advertisement -
- Advertisement -

Hardik Pandya will not be available for Test series

మెల్‌బోర్న్: హార్దిక్ పాండ్యా ఈ మ్యాచ్‌లో మరోసారి మెరిశాడు. టీ20 ఫార్మట్ స్పెషలిస్ట్‌గా తనకు ఉన్న పేరును అతను మరోసారి నిలబెట్టుకున్నాడు. పాకిస్తాన్ అనగానే తనలోని కొత్త కోణాన్ని చూపిస్తుంటాడీ గుజరాతీ. ఇప్పుడూ అదే జరిగింది. పాకిస్తాన్‌పై మళ్లీ విరుచుకుపడ్డాడు. తన నాలుగు ఓవర్ల కోటాలో 30 పరుగులు ఇచ్చి- మూడు వికెట్లను నేలకూల్చాడు. బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేశాడు హార్దిక్. హార్దిక్ పాండ్యా దెబ్బకు మిడిలార్డర్ బ్యాటర్లు షాదబ్ ఖాన్-5, హైదర్ అలీ- 2, మహ్మద్ నవాజ్- 9 పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగారు. పాకిస్తాన్‌పై సహజంగానే తన ప్రతాపాన్ని చూపుతుంటాడు హార్దిక్ పాండ్యా. అది అతని సహజ స్వభాగంగా మారింది. చివరి అయిదు మ్యాచ్‌లల్లో వికెట్‌లెస్ కాదతను. ఈ అయిదింట్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు మ్యాచ్‌లల్లో మూడు చొప్పున, మిగిలిన రెండింట్లో ఒక్కో వికెట్ తీసుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News