- Advertisement -
హైదరాబాద్: నగరంలోని కెపిహెచ్ బిలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కాలనీలోని తలాబ్ స్మశానవాటిక వద్ద గుర్తు తెలియని మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. యువకుడిని దుండగులు హత్య చేసి తగలబెట్టినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Young Man Found dead in Kukatpally’s KPHB
- Advertisement -