Tuesday, December 24, 2024

‘హీరోస్ ఆర్ నాట్ బార్న్.. దే రైజ్’

- Advertisement -
- Advertisement -

Prabhas Birthday: Heroic Poster Out from 'Project K'

రెబల్ స్టార్ ప్రభాస్, క్రియేటివ్ డైరెక్టర్ నాగ్‌అశ్విన్‌ల ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ ‘ప్రాజెక్ట్ కె’ కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ‘ప్రాజెక్ట్ కె’ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో ప్రభాస్ చేయి ఓ కవచంతో గాలిలోకి దూసుకెళుతున్నట్లు కనిపిస్తోంది. పోస్టర్‌పై ‘హీరోస్ ఆర్ నాట్ బార్న్, దే రైజ్’ (హీరోలు పుట్టరు, ఎదుగుతారు) అనే మాటలు ప్రభాస్ హీరోయిక్ పాత్రని తెలియజేస్తున్నాయి. ఈ చిత్రంలో బిగ్‌బి అమితాబ్ బచ్చన్ కీలకపాత్ర పోషిస్తుండగా, ప్రభాస్ సరసన దీపికా పదుకొనే కథానాయికగా నటిస్తోంది. విజయవంతంగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్న టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ ఈ గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్‌ను అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. అశ్వినిదత్ నిర్మాత.

Prabhas Birthday: Heroic Poster Out from ‘Project K’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News