- Advertisement -
న్యూఢిల్లీ: గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1,334 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనా వైరస్ బారిన పడి మరో 16మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. తాజా కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం పాజిటీవ్ కేసుల సంఖ్య 4.46కోట్లు దాటగా.. కరోనా మహమ్మారి నుంచి 4.40కోట్లకు పైగా బాధితులు కోలుకున్నారు. కాగా, దేశంలో ఇప్పటివరకు 5,28,977 మంది కరోనాతో మరణించారు. ప్రస్తుతం దేశంలో 23,193 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 1.52 శాతంగా ఉండగా, రికవరీ రేటు 98.76 శాతంగా ఉందని ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 219.56కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు తెలిపింది.
India Reports 1334 new corona cases in 24 hrs
- Advertisement -