నల్గొండ : మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ప్రధాన రాజకీయ పార్టీలతో సమానంగా మునుగోడు ప్రజలకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ వరాలు పలుకుతున్నారు. ఉప ఎన్నికల్లో తానే గెలుస్తానని ధీమాగా ప్రకటిస్తున్నారు. మునుగోడును మరో అమెరికా చేస్తానని ఇప్పటికే ఓటర్లకు హామీ ఇచ్చిన పాల్ ఇప్పుడు మునుగోడు ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. రాజకీయ పార్టీలు ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేవని, తాను మాత్రమే చేయగలనని అన్నారు. దీపావళి పండుగ రోజున మునుగోడులో పర్యటించి ఓటర్లకు శుభాకాంక్షలు తెలిపి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం స్థానికంగా ఉన్న ఓ సెలూన్‌కు వెళ్లి జుట్టు కత్తిరించుకున్నాడు. 60 నెలల్లో ఇతర పార్టీలు చేయలేని మునుగోడును ఆరు నెలల్లో అభివృద్ధి చేస్తానని పాల్ ఓటర్లకు హామీ ఇచ్చారు. ప్రతి మండలంలో కళాశాల, ఆరు నెలల్లో ఉచిత ఆసుపత్రి నిర్మిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి మండలానికి 1000 ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన ముచ్చట తెలిసిందే.
ఆరు నెలల్లో మునుగోడును అభివృద్ధి చేస్తా: కేఏ పాల్
- Advertisement -
- Advertisement -
- Advertisement -