- Advertisement -
లండన్: కింగ్ చార్లెస్ IIIని కలిసిన తర్వాత బ్రిటన్ తొలి భారత సంతతి ప్రధానమంత్రిగా రిషి సునాక్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. రెండు శతాబ్దాలలో యుకె అతి పిన్న వయస్కుడైన ప్రధాన మంత్రి అయిన సునాక్, చారిత్రాత్మక నాయకత్వ పరుగులో కన్జర్వేటివ్ పార్టీ కొత్త నాయకుడిగా ఎన్నికైన ఒక రోజు తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రిషి సునాక్ మాట్లాడుతూ.. బ్రిటన్ ఎదుర్కొంటున్న సమస్యలను అధిగమిస్తామన్నారు. తమ ప్రభుత్వం ప్రతి దశలో పారదర్శకంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. అందరితో కలిసి పనిచేసి దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెడతామని చెప్పారు.
- Advertisement -