Saturday, December 21, 2024

‘మనీ’గోడుపై ఇసి నజర్

- Advertisement -
- Advertisement -

డబ్బు, మద్యం పంపిణీపై ఎన్నికల కమిషన్ ఆరా అక్రమ నగదు
ప్రవాహాన్ని అడ్డుకునేందుకు పరిశీలకులుగా ఐటీ అధికారులు
ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్న సిఇఒ వికాస్‌రాజ్
ప్రత్యేకంగా కాల్ సెంటర్ ఏర్పాటు

మనతెలంగాణ/హైదరాబాద్ : మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా డబ్బు, మద్యం పంపిణీపై రా ష్ట్ర ఎన్నికల కమిషన్ ఆరా తీస్తోంది. ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పరిశీలకులకు స్పష్టం చేసింది. మునుగోడు ఉప ఎన్నికకు నో టిఫికేషన్ జారీ చేసినప్పటి నుంచి మంగళవారం వరకు 19 కేసులు నమోదు చేసి రూ. 2.70 కోట్ల- నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది 1,500 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకుని, 36 మందిని అరె స్టు చేసి 77 కేసులు నమో దు చేశారు. మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు తాయిలాలు అందిస్తున్నారని, ప్రలోభాలకు గురిచేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది.

విచ్చలవిడిగా డబ్బులు, మద్యం, ఇతర తాయిలాలను పంపిణీ చేస్తున్నవారిపై, తీసుకున్నవారిపై ఐపీసీ సెక్షన్ 171(బి) కింద కేసులు నమోదు చేయాలని ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎవరైనా అభ్యర్థిని లేదా ఓటరును లేదా మరే ఇతర వ్యక్తిని బెదిరించినా, గాయపర్చినా సెక్షన్ 171(సి) కింద కేసు పెట్టాలని సూచించింది. ఈ రెండు కేసుల్లో ఏడాది జైలుశిక్ష లేదా జరిమానా లేదా రెండింటిని విధించే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులను పంపిణీ చేస్తున్నట్లు ఎక్కడ ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా వెంటనే స్పందించిన చర్యలు తీసుకునేలా ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఫిర్యాదుల కోసం ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 0868-2 230198ను ఏర్పాటు చేశారు.

క్షేత్రస్థాయిలో పర్యవేక్షకులు

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా టోల్ ఫ్రీ నెం బర్‌కు వచ్చే ఫిర్యాదులపై స్పందించడంతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రత్యేకంగా కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. మండలాలు, గ్రామా ల వారీగా పర్యవేక్షకులను నియమించుకుని ఎప్పటికప్పుడు అక్కడి పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కాల్ సెంటర్ సిబ్బంది పర్యవేక్షికులకు ఫో న్లు ఆయా గ్రామాలలో పరిస్థితులను అడిగి తెలుసుకుని, ఏమైనా సమస్య ఉంటే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందజేస్తారు.

ఎప్పటికప్పుడు లైవ్ వీడియో ద్వారా పరిశీలన

మునుగోడు ఉప ఎన్నికలో కొత్త లైవ్ వీడియో పర్యవేక్షణ విధానం అమలు చేస్తున్నారు. చెక్ పోస్టుల విధులు నిర్వహిస్తున్న వారు, ఫ్లైయింగ్ స్కాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు క్షేత్రస్థాయిలో తీసే వీడియోలు నల్గొండ కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు. క్షేత్రస్థాయిలో సిబ్బంది తీసే వీడియోలు కంట్రోల్ రూమ్‌లో ప్రత్యక్షంగా ప్రసారమవుతాయి. ఈ లైవ్ ద్వారా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితులను పర్యవేక్షిస్తారు. ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నా రు. అభ్యర్థులు లేదా వారి తరపు ఏజెంట్లు కంట్రో ల్ రూమ్‌లో లైవ్ వీక్షించేందుకు అనుమతిస్తారు.

అదనపు పరిశీలకులు

మునుగోడులో అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు కేంద్రం ఎన్నికల సంఘం అదనపు పరిశీలకులను నియమించింది. ఎన్నికల అదనపు పరిశీలకులుగా ఐఆర్‌ఎస్ అధికారి సుభోత్ సింగ్, ఎన్నికల వ్యయ పరిశీలకులుగా ఐఆర్‌ఎస్ అధికారి సమత ముళ్లపూడిని తాజాగా నియమించింది. అక్రమ నగదు ప్రవాహం నియంత్రణలో వీరికి సహకరించేందుకు మరో ఏడుగురు ఆదాయ పన్నుశాఖ అధికారులను ఆ శాఖ ప్రిన్సిపల్ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్స్) మునుగోడుకు పంపించనున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News