Saturday, January 11, 2025

పోలీస్ స్టేషన్‌లో పైకప్పు కూలి కానిస్టేబుల్ కు గాయాలు

- Advertisement -
- Advertisement -

అమరావతి: పోలీస్ స్టేషన్‌లో పైకప్పు పెచ్చులూడిపడడంతో కానిస్టేబుల్, సిఐ కూతురు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్‌టిఆర్ జిల్లా మైలవరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. మైలవర్ పోలీస్ స్టేషన్‌లో ఎల్ రమేష్ సిఐగా పని చేస్తున్నారు. సిఐ కుమార్తె మోక్షితను తీసుకొని కార్యాలయానికి వచ్చారు. కానిస్టేబుల్ జమలయ్య, సిఐ కుమార్తె కూర్చుంది. పెచ్చులూడి కానిస్టేబుల్ తల మీద పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సిఐ కూతురు స్వల్పంగా గాయపడింది. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. మూడు సంవత్సరాల క్రితం కొత్త భవనాన్ని నిర్మించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పాత బస్టాండ్ పక్కన ఉన్న పాత భవనాన్ని సిఐ కార్యాలయంగా ఉపయోగిస్తున్నారు. పైకప్పు కూలిపోవడంతో తాత్కాలిక మరమ్మతులు చేయించారు. కూలిపోయిన స్థితిలో ఉన్న భవనాన్ని స్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని సిఐ వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News