- Advertisement -
హైదరాబాద్: సికింద్రాబాద్ ప్రాంతం దూద్ బావిలో బుధవారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ పేలుడుతో స్థానికులు పరుగులు తీశారు. దూద్ బావి ప్రాంతంలోని ఓ ఇంట్లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో నాలుగు ఇండ్ల గోడలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. శిధిలాల కింద పలువురు చిక్కుకోవడంతో వారిని వెంటనే బయటికి తీశారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. ప్రమాద స్థలాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు సందర్శించి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. మృతుడు నారాయణ స్వామిగా పోలీసులు గుర్తించారు.
- Advertisement -