Monday, December 23, 2024

ఇంగ్లండ్‌కు ఐర్లాండ్ షాక్

- Advertisement -
- Advertisement -

Ireland's victory by five runs against England

ప్రపంచకప్‌లో మరో సంచలనం

మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న టి20 ప్రపంచకప్‌లో మరో సంచలన ఫలితం నమోదైంది. బుధవారం జరిగిన గ్రూప్1 సూపర్12 మ్యాచ్‌లో పసికూన ఐర్లాండ్ డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో బలమైన ఇంగ్లండ్‌పై ఐదు పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 19.2 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌటైంది. తర్వాత లక్షఛేదనకు దిగిన ఇంగ్లండ్ 14.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 105 పరుగులు చేసింది. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్ ముందుకు సాగలేదు. దీంతో డక్‌వర్త్ లూయిస్ విధానంలో ఫలితాన్ని తేల్చారు. దీనిలో ఐర్లాండ్ ఐదు పరుగుల తేడాతో జయకేతనం ఎగుర వేసింది. ఇక ఊరిస్తున్న లక్షంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు ఇన్నింగ్స్ రెండో బంతికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ జోస్ బట్లర్ ఖాతా తెరవకుండానే జోషువా లిటిల్ బౌలింగ్‌ల టయ్యాడు. ఆ వెంటనే మరో ఓపెనర్ అలెక్స్ హేల్స్ ఔటయ్యాడు. హేల్స్ ఏడు పరుగులు మాత్రమే చేసి వెనుదిరిగాడు. ఈ వికెట్ కూడా జోషువాకే దక్కింది. ఇక జట్టును ఆదుకుంటాడని భావించిన స్టార్ బ్యాటర్ బెన్ స్టోక్స్ కూడా నిరాశ పరిచాడు.

ఆరు పరుగులు మాత్రమే ఫివోన్ హ్యాండ్ వేసిన అద్భుత బంతికి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో ఇంగ్లండ్ 29 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో డేవిడ్ మలాన్, హారి బ్రూక్ కొద్ది సేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. బ్రూక్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ వెంటనే మలాన్ కూడా పెవిలియన్ చేరాడు. సమన్వయంతో బ్యాటింగ్ చేసిన మలాన్ రెండు ఫోర్లతో 35 పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక కీలక ఇన్నింగ్స్ ఆడిన మొయిన్ అలీ 12 బంతుల్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్స్‌తో 24 పరుగులు చేసి నాటౌగా ఉన్నాడు. ఈ సమయంలో వర్షం రావడంతో మ్యాచ్‌ను ఇక్కడే నిలిపి వేశారు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్‌ను కెప్టెన్ బాల్‌బిర్ని ఆదుకున్నాడు. ఇంగ్లండ్ బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బాల్‌బిర్నీ 47 బంతుల్లో ఐదు ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. మరోవైపు వికెట్ కీపర్ టక్కర్ మూడు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 34 పరుగులు చేశాడు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 82 పరుగులు జోడించారు. అయితే వీరు ఔటైన తర్వాత ఐర్లాండ్ వరుస క్రమంలో వికెట్లను కోల్పోయింది. లివింగ్ స్టోన్, సామ్ కరన్, మార్క్‌వుడ్‌లు అద్భుత బౌలింగ్‌తో ఆకట్టుకున్నారు. లివింగ్‌స్టోన్, వుడ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. సామ్ కరన్ రెండు వికెట్లు తీశాడు. దీంతో ఐర్లాండ్ ఇన్నింగ్స్ 157 పరుగుల వద్ద ముగిసింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News