Monday, December 23, 2024

రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థిని భవనం పైనుంచి దూకి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సరూర్ నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని కృష్ణవేణి క్యాంపస్ భవనం పైనుంచి ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల 9వ తరగతి విద్యార్థిని దూకి ఆత్మహత్య చేసుకుంది. భవనం పైనుంచి పంతం శ్రేష్టవి(15) దూకడంతో తీవ్రంగా గాయపడింది. వెంటనే విద్యార్థినిని మలక్ పేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మలక్ పేట యశోదా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలిక మృతి చెందినట్లు యశోదా వైద్యులు నిర్ధారించారు. స్కూల్ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం కారణంగా వైద్యం అందక మరణించిదని బాలిక బంధువులో ఆరోపణలు చేస్తున్నారు.  బాలిక కనిపించడంలేదని ఉదయం 10 గంటలకు తల్లిదండ్రులకు స్కూల్ సిబ్బంది సమాచారం ఇచ్చారు. 11 గంటలకు తల్లిదండ్రులు స్కూల్ వెళ్ళితే బాలిక ఉందని, 12 గంటలకు ఐదు అంతస్థుల భవనం పైనుంచి పడిందని ప్రిన్సిపాల్ చెప్పారన్నారు. మృతిపై పలు అనుమానాలు ఉన్నాయని బాలిక తల్లిదండ్రులు వాపోతున్నారు. కృష్ణవేసి క్యాంపస్ భవనంలో ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ను నడిపిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News