Monday, December 23, 2024

డేరా బాబాకు పెరోల్‌లో నా పాత్ర లేదు: సిఎం ఖట్టార్

- Advertisement -
- Advertisement -

డేరా బాబాకు పెరోల్‌లో నా పాత్ర లేదు
హర్యానా సిఎం ఖట్టార్ వివరణ

 

న్యూఢిల్లీ: డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్‌కు పెరోల్ మంజూరులో తన పాత్ర ఏమీ లేదని, జైళ్లకు సొంత నిబంధనలు ఉంటాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. సిర్సాలోని తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై అత్యాచారానికి పాల్పడిన నేరానికి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రామ్ రహీమ్‌కు గత వారం 40 రోజుల పెరోల్ మంజూరైంది. నవంబర్ 3వ తేదీన హర్యానాలోని అదంపుర్ అసెంబ్లీకి ఉప ఎన్నికతోపాటు పంచాయతీ ఎన్నికలు జరగనున్న తరుణంలో రామ్ రహీమ్‌కు పెరోల్ ఇవ్వాలన్న నిర్ణయంపై తీవ్రస్థాయిలో దుమారం రేగింది. గత కొన్ని రోజులుగా ఉత్తర్ ప్రదేశ్‌లోని తన బర్నావా ఆశ్రమం నుంచి ఆన్‌లైన్ ద్వారా తన భక్తులకు రామ్ రహీమ్ ఉపన్యాసాలు ఇస్తున్నారు. వీటికి హర్యానాకు చెందిన బిజెపి నాయకులతోసహా పలువురు అనుచరులు హాజరవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News