Thursday, November 28, 2024

ఉప్పల్ చౌరస్తాలో చివరి దశకు స్కైవాక్ వే పనులు

- Advertisement -
- Advertisement -

జనవరిలో ప్రారంభానికి అధికారులు కసరత్తు
రూ.25 కోట్లతో చౌరస్తా చుట్టూ నిర్మాణం
6 చోట్ల ఎక్కేందుకు, దిగేందుకు ఎస్కలేటర్లు
36 పిల్లర్లు, 6.15 మీటర్ల ఎత్తు, 640 మీటర్ల పొడవు

మన తెలంగాణ/సిటీ బ్యూరో: నగరంలోని ప్రధాన జం క్షన్లలో ఒక్కటైన ఉప్పల్ క్రాస్ రోడ్ మరింత ఆకర్షణీయంగా మారనుంది. హెచ్‌ఎండిఎ ఆధ్వర్యంలో చేపట్టిన స్యై వాక్‌వే పనులు చకచక కొనసాగుతున్నాయి. ఈ స్కైవాక్ వే అందబాటులోకి వస్తే పాదచారులు బాధలు తీరినట్లే. ఈచౌరస్తాలో నలువైపుల నుంచి దూసుకువచ్చే వాహనాలను తప్పించుకుని పాదచారులు రోడ్డు దాటాలంటే ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకోవాల్సిందే. వరంగల్ వైపు నుంచి సికింద్రాబాద్‌తోపాటు హైదరాబాద్ వ చ్చే వాహనాలతో పాటు ఎల్‌బినగర్ వైపు నుంచే వచ్చేవా రు సైతం ఉప్పల్ క్రాస్ రోడ్‌ను దాటాల్సిందే. దీంతో ఈ చౌరస్తాలో నిమిష, నిమిషానికీ వాహనాలు చీమల దం డును తలపిస్తుండడంతో పాదచారులు రోడ్డు దాట్టేందుకు ప్రతి రోజు అష్టాకష్టాలు పడుతుంటారు. అయితే పాదచారుల కష్టాలు త్వరలోనే తీరనున్నాయి. హైదరాబాద్ మెట్రో డవలప్‌మెంట్ అథారటీ (హెచ్‌ఎండిఎ) రూ. 25కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ స్కైవాక్‌ను డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయాలని లక్షంగా పెట్టుకున్న హెచ్‌ఎండిఎ అధికారులు జనవరి రెండవ వారం నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణంగా స్కైవాక్ నిర్మాణం

ఉప్పల్ క్రాస్ రోడ్‌లో నిర్మిస్తున్న స్కైవాక్ ప్ర త్యేక ఆకర్షణగా నిలవనుంది. స్కైవాక్ వేపై నడుస్తూ ఉప్పల్ అందాలను తిలకించే విధంగా దీనిని తీర్చిదిద్దుతున్నారు. ఉప్పల్ క్రాస్ రోడ్డు చుట్టూ ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా స్కైవాక్‌ను నిర్మిస్తున్నారు. ఉప్పల్ చౌరస్తా చుట్టూ 6 చోట్లు (1. నాగోల్ రోడ్డు, 2. రామాంతాపూర్ రోడ్డు, 3. జిహెచ్‌ఎంసి థీమ్ పార్క్, 4. వరంగల్ బస్టాపు వైపు, 5 ఉప్పల్ పోలీసుస్టేషన్, 6. ఉప్పల్ విద్యుత్ సబ్ స్టేషన్) గుండా ఈ స్కైవాక్ ఎక్క డం, దిగడం కోసం ఎస్కలేటర్స్, లిప్టులను ఏర్పాటు చేస్తున్నారు.

అదేవిధంగా నేరుగా రెండు వైపులా ఉప్పల్ మెట్రో స్టేషన్‌లోకి వేళ్లే విధంగా స్కైవాక్‌ను కలుపుతున్నా రు. ఆర్.పి అనే సంస్థ రూ.25 కోట్ల వ్యయంతో ఈ స్కై వాక్‌ను 36 పిల్లర్లతో 6.15 మీటర్ల ఎత్తులో 640 మీటర్ల పొడవునా దీనిని నిర్మిస్తోంది. దీనికితోడు రూ.311 కోట్ల వ్యయంతో ఉప్పల్ చౌరస్తా మీదగా ఫ్ల్లై ఓవర్‌ను నిర్మాణం కొనసాగుతోంది. దీనికి తోడు ఇప్పటికే రూ. 28లక్షల వ్యయంతో ఈ చౌరస్తాను పూర్తిగా సుందరీకరించడంతోపాటు పక్కనే థీమ్ పార్క్‌ను సైతం నిర్మించారు. దీంతో ఒకవైపు మెట్రో బ్రిడ్జి మరో వైపు ప్లైవర్, మధ్యలో స్కైవాక్‌చ మరోపక్క థీమ్ పార్క్‌తో ఈ చౌరస్తా మరింత ఆకర్షనీయంగా కనిపించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News