- Advertisement -
హైదరాబాద్: బ్రిడ్జి నిర్మాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. బేగంపేట్‌లో పికెట్ నాలా బ్రిడ్జిని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తలసాని మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఎస్‌ఎన్‌డిపి ద్వారా చేపట్టిన పనులు ఒక్కొక్కటి పూర్తి చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మి, ఎంఎల్‌ఎ సాయన్న పాల్గొన్నారు. పది కోట్ల రూపాయల వ్యయంతో పికెట్ నాలాపై బ్రిడ్జి నిర్మాణం చేపట్టారు.
- Advertisement -