హైదరాబాద్: నగరంలోని గచ్చిబౌలిలో చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను సైబరాబాద్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 45 గ్రాముల బంగారు ఆభరణాలు, 6,900 నగదు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటపై మాదాపూర్ డిసిపి శిల్పవల్లి మాట్లాడుతూ… రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని బిహెచ్ఇఎల్ లో నడుచుకుంటూ వెళ్తున్న కనకలక్ష్మి అనే మహిళ మెడలో ఉన్న చైన్ ను లాగేందుకు దుండగుడు ప్రయత్నించాడు. మహిళ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేశామన్నారు. తుషార్ హిరమాన్(32) అనే నిందితుడు ఈ స్నాచింగ్ కు పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. నిందితుడు తుషార్ హిరమాన్, మీదగడ్డ పద్మాలతతో అక్రమ సంబంధం పెట్టుకొని ఇద్దరు కలిసి జీవిస్తున్నారు. డబ్బు అవసరమై చైన్ స్నాచింగ్ లకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. నిందితుడు చైన్ స్నాచింగ్ చేయగా దాన్ని పద్మాలత అమ్మేందుకు ప్రయత్నించారు. పక్క సమాచారంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని డిసిపి శిల్పవల్లి పేర్కొన్నారు.
చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఇద్దరి అరెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -