Friday, January 3, 2025

మునుగోడు ఎన్నికల్లో మూడో స్థానానికి బిజెపి పరిమితం

- Advertisement -
- Advertisement -

Gangula kamalakar Election campaign in Munugode

కెసిఆర్ సర్కార్ పై నమ్మకం ఉంది కాబట్టే వామపక్షాలు కలిసి వస్తున్నాయి

ప్రజల్లో కెసిఆర్ గారి పట్ల, టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విపరీతమైన ప్రేమ ఉంది

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న ప్రతి చోటా జరిగిన అభివృద్ధి మునుగోడులో సైతం జరగబోతుంది

మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి గంగుల కమలాకర్

హైదరాబాద్ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో టిఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది, సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలో ఇన్చార్జిగా ఉన్న రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ నేడు ఉదయం నుండి బిజీ బిజీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు, ముఖ్య కార్యకర్తలతో భేటీ అనంతరం పలు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మునుగోడు లో టిఆర్ఎస్ పార్టీ పట్ల, సీఎం కేసీఆర్ గారి పాలన పట్ల స్థానిక ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కారు గుర్తుకే ఓటేసి గెలిపించుకుంటామని ముక్తకంఠంతో ప్రజలు చెబుతుండడం ఆనందంగా ఉందన్నారు.

స్థానికంగా అందుబాటులో ఉండని రాజగోపాల్ రెడ్డికి ఒకసారి ఓటేసి మోసపోయామని, మరోసారి ఆ తప్పు చేయబోమని మంత్రి కి వివరిస్తున్నారు. స్థానికంగా ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు, రాష్ట్రంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్న ప్రతి చోటా జరిగిన బ్రహ్మాండమైన అభివృద్ధిని మునుగోడుకు తీసుకొస్తామన్నారు. ప్రజల నుండి వస్తున్న సానుకూల స్పందనను చూసి తట్టుకోలేక బిజెపి కొత్త డ్రామాలకు తెరతీసిందని, అందులో భాగంగానే గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలని మంత్రి అన్నారు, ఎన్ని డ్రామాలు చేసిన వారు మూడో స్థానానికే పరిమితం అవుతారని మునుగోడులో భారీ మెజార్టీతో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలవడం ఖాయం అయిపోయిందన్నారు. మంత్రి గంగుల కమలాకర్ అంతకుముందు నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ప్రచార తీరుతెన్నులపై వారికి దిశా నిర్దేశం చేశారు. పలు సంఘాల ప్రతినిధులు కలిసి మంత్రికి వినతి పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థాన్ నారాయణపురం ఎంపీపీ గుప్త ఉమా ప్రేమ్చంద్రారెడ్డి, సర్పంచ్ సిక్ల మెట్ల శ్రీహరి, ఫాక్స్ చైర్మన్ జెక్కిడి జంగారెడ్డి, టిఆర్ఎస్, సిపిఐ శ్రేణులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News