- Advertisement -
నివాసంలోకి చొరబడ్డ ఆగంతకుడు
వాషింగ్టన్ : అమెరికాలో చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ భర్త పాల్ పెలోసిపై ఆయన నివాసంలోనే దాడి జరిగింది. శుక్రవారం ఉదయం శాన్‌ఫ్రాన్సిస్కోలోని పెలోసి నివాసంలోకి ఓ దుండగుడు చొచ్చుకుని వచ్చాడని, తీవ్రస్థాయిలో దాడికి దిగాడని అధికారులు తెలిపారు. ఈ ఘటన సమయంలో స్పీకర్ పెలోసి దేశంలో మిడ్‌టర్మ్ ఎన్నికలలో ప్రచార పర్యటనలో ఉన్నారు. 82 సంవత్సరాల పాల్ పెలోసిపై దాడి ఘటనను స్పీకర్ కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని వివరించారు . అయితే దాడి ఏ విధంగా , ఎందుకు జరిగిందనే సమాచారం వెల్లడించలేదు. దాడికి దిగిన వ్యక్తిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. గత ఏడాది జనవరిలో కూడా స్పీకర్ నివాసంపై ఓ గుంపు దాడికి దిగింది. ఇంటి పరిసరాలలో అభ్యంతరకర చర్యలకు దిగారు.
- Advertisement -