Sunday, December 22, 2024

వాహనాల దొంగ అరెస్ట్

- Advertisement -
- Advertisement -

vehicle thief arrested in hyderabad

మూడు ఆటోలను చోరీ చేసిన నిందితుడు

హైదరాబాద్: వాహనాలను చోరీ చేస్తున్న నిందితుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మూడు ఆటోలు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… ముస్లీం దోబీ ఘాట్, మల్లేపల్లికి చెందిన సయిద్ అబ్దుల్లా అలాయాస్ నూర్ కూలీ పని, ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. చిన్నప్పుడే తండ్రి చినిపోవడంతో చదువుకోకుండా చిన్ని చిన్న పనులు చేస్తుండేవాడు. ఈ క్రమంలోనే వ్యసనాలకు బానిసగా మారిన నిందితుడు ఇళ్లల్లో చోరీలు చేయడం ప్రారంభించాడు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిందితుడు 13 దొంగతనాలు చేశాడు. ఏడు కేసుల్లో నిందితుడికి జైలు శిక్షపడింది. నిందితుడు మూడు ఆటోలను చోరీ చేశాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం లంగర్‌హౌస్ పోలీసులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇన్స్‌స్పెక్టర్ రఘునాథ్, ఎస్సైలు సాయికిరణ్ తదితరులు పట్టుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News