Saturday, December 21, 2024

మనస్సు విప్పిన సమంత

- Advertisement -
- Advertisement -

Samanta-Ruth-Prabhu
హైదరాబాద్: నటి సమంత రుత్ ప్రభు చివరికి మనస్సు విప్పింది. తాను ఇటీవల మైయోసిటిస్ అనే ఆటోఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతూ వచ్చినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపింది. తన రాబోయే చిత్రం ‘యశోద’ ట్రయిలర్‌కు ఫ్యాన్స్ చూపిన రెస్పాన్స్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపింది.

మైయోసైటిస్ అనేది ఓ అరుదైన వ్యాధి. దాని వల్ల కండరాలు బలహీనంగా అవుతాయి, తద్వారా అలసట, నొప్పిని ఎదుర్కొవలసి వస్తుంది. ఈ వ్యాధి సాధారణంగా రోగనిరోధక శక్తి బలహీనం అవ్వడం వల్ల వస్తుంది. అది ఆరోగ్యవంతమైన కణజాలం మీద కూడా పొరపాటున దాడిచేస్తుంటుంది. 35ఏళ్ల వయస్సున్న సమంత త్వరలో తాను కోలుకుంటానని తెలిపింది. డాక్టర్లు కూడా తాను సంపూర్ణంగా కోలుకుంటానన్న అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News