Monday, December 23, 2024

రెస్టారెంట్‌లో చేపల వేట

- Advertisement -
- Advertisement -

Japanese Restaurant Lets Customers Catch Their Own Fish

జపాన్ ఒసాకాలో సందడి

టోక్యో : జనం ఇప్పుడు జపాన్‌లోని జాఓ రెస్టారెంట్‌కు ఎగబడుతున్నారు. అక్కడికి వెళ్లేవారు నచ్చిన చేపను గాలమేసి పట్టుకుని చేపకూర కోసం ఆర్డర్ ఇవ్వవచ్చు. సాధారణంగా ఎవరైనా ఓ హోటల్‌కు వెళ్లినా ఇష్టమైన వంటకు ఆర్డర్ ఇవ్వవచ్చు కానీ, తమంతతాముగా తగు సరుకును రెస్టారెంట్ వారికి ఇవ్వడం కుదరదు. అయితే ఇందుకు భిన్నంగా ఈ జపనీ రెస్టారెంట్ వినూత్న ప్రయోగానికి దిగింది. రెస్టారెంట్ ఆవరణలో ఉన్న కొలనులో కస్టమర్లు చేపలు పట్టుకోవచ్చు. గాలాలేసి తాము ఇష్టపడే నాటు ఘాటు రకం చేప ఏదైనా ఏదో విధంగా గాలానికి దక్కేలా చేసుకుని దీనిని రెస్టారెంట్ వారికి అందిస్తే చాలు వారు ఈ చేపను రుచికరంగా వండి వడ్డిస్తున్నారు.

సంబంధిత రెస్టారెంట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో ప్రచారం పొందాయి. కస్టమర్లు బోటులో లేక్‌లో తిరుగుతూ చేపల వేటకు దిగవచ్చు. చేపను పట్టేసిన వ్యక్తి పేరిట కొద్ది సేపు బాజాభజంత్రీలతో హంగామా జరుగుతుంది. తరువాత రెస్టారెంట్ కిచెన్‌లో ఈ చేప వంటకం సిద్ధం అయి, సదరు చేపపట్టిన వ్యక్తి ఆరగించేందుకు సిద్ధం అవుతుంది. ఎంచుకున్న చేపను గాలమేసి పట్టుకుని దీనిని ఆరగిస్తే ఆ ఆనందం వేరే విధంగా ఉంటుంది. పైగా ఈ విధంగా చేప పట్టిన వ్యక్తికి బిల్లులో తగ్గింపు కూడా ఉంటుంది. సాధారణంగా జపాన్‌లో పేరొందిన రెడ్ స్నాపర్ ఫిష్ ధర 4180 యెన్లు. . అయితే గాలమేసి పట్టుకున్న చేప వంటకం ధర ఈ రెస్టారెంట్‌లో చాలా తక్కువగా ఉంటుంది. జపాన్‌లోని ఒసాకాలో వెలిసిన ఈ రెస్టారెంట్‌కు ఇప్పుడు జనం తరలివెళ్లుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News