Monday, December 23, 2024

ప్యారమౌంట్ కాలనీలో కార్టన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

Carton search at Paramount Colony

పాల్గొన్న 400మంది పోలీసులు
41మంది వీసా గడువు ముగిసిన విదేశీయులు గుర్తింపు

మనతెలంగాణ, హైదరాబాద్ : బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు శనివారం కార్టన్ సెర్చ్ నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 9.30 గంటల వరకు 400మంది పోలీసులు పాల్గొన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యారమౌంట్ కాలనీ, టోలీచౌకి ఏరియాలోని ప్రతి ఒక్క ఇంటిని తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో వీసా గడువు ముగిసినా ఇక్కడే ఉంటున్న 41మంది విదేశీయులను గుర్తించి, వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఐదుగురు అనుమానస్పద వ్యక్తులు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నట్లుగా గుర్తించారు. ఎలాంటి ధృవపత్రాలు లేని 29 వాహనాలు, ఎయిర్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డిసిపి జోయల్ డేవిస్, డిసిపి చక్రవర్తి, ఎడిసిపి ఇక్బాల్ సిద్దిఖీ, ఎసిపిలు సుదర్శన్, శివమారుతి, పివి గణేష్ తదితరులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News