Monday, December 23, 2024

ఆటోలు చోరీ చేస్తున్న ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

Auto theft gang arrested

ఇక్కడ కొట్టేసి కర్నాటకలో అద్దెకు ఇస్తున్న నిందితులు
నలుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యుల అరెస్టు
రూ.30లక్షల విలువైన 21 ఆటోలు స్వాధీనం
వివరాలు వెల్లడించిన మల్కాజ్‌గిరి డిసిపి రక్షితమూర్తి

మనతెలంగాణ, సిటిబ్యూరోః పార్కింగ్ చేసిన ఆటోలను చోరీ చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మల్కాజ్‌గిరి పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30లక్షల విలువైన 21 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. మల్కాజ్‌గిరి డిసిపి రక్షితమూర్తి తన కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కర్నాటక రాష్ట్రం, గుల్బార్గా జిల్లా, అడికి మండలం, హుడా గ్రామానికి చెందిన మగనూరి శ్రీనివాస్ ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ మౌలాలీలోని ఆర్‌టిసి కాలనీలో ఉంటున్నాడు. మునావర్ బైగ్ అలియాస్ మున్నా, అన్వర్ బైగ్ అలియాస్ శ్రుక్ అలియాస్ షేరు, జావిద్ అందరూ ఆటోడ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ప్రధాన నిందితుడు శ్రీనివాస్ వ్యసనాలకు బానిసగా మారాడు.

దీంతో వస్తున్న డబ్బులు సరిపోకపోవడంతో ఆటోలను చోరీ చేయడం ప్రారంభించాడు. రాచకొండ, సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్కింగ్ చేసిన ఆటోలను రాత్రి సమయంలో చోరీ చేసి కర్నాటకకు చెందిన ముగ్గురికి విక్రయిస్తున్నాడు. మల్కాజ్‌గిరి, నేరెడ్‌మెట్, మియాపూర్, చందానగర్, ఆర్‌సి పురం పోలీస్ స్టేషన్ల పరిధిలో ఆటోలను చోరీ చేశాడు. ఆటోలను కొనుగోలు చేసిన ముగ్గురు నిందితులు ఆటోల కలర్, బాడీషేప్, నంబర్ ప్లేట్, ఇంజిన్ నంబర్‌ను కర్ణాటక రాష్ట్రానికి అనుగుణంగా మార్చి అద్దెకు ఇస్తున్నారు. ఆటోల చోరీపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితులను అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ జగదీశ్వర్ రావు, డిఎస్సై కృష్ణమల్ సురా తదితరులు పట్టుకున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News