Monday, December 23, 2024

‘యశోద’లో కథే హీరో

- Advertisement -
- Advertisement -

Varalaxmi Sarathkumar interview about 'Yashoda'

సమంత టైటిల్ పాత్రలో నటించిన సినిమా ’యశోద’. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర చేశారు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించారు. హరి, హరీష్ దర్శకత్వం వహించారు. నవంబర్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా వరలక్ష్మీ శరత్ కుమార్ మీడియాతో ముచ్చటిస్తూ చెప్పిన విశేషాలు…
గ్రే షేడ్స్ ఉన్న రోల్…
సినిమా ట్రైలర్ చూస్తే నా క్యారెక్టర్ చాలా ప్రశాంతంగా ఉంటుంది. కథ ముందు సాగేటప్పుడు క్యారెక్టర్ గురించి మరింత తెలుస్తుంది. గ్రే షేడ్స్ ఉన్న రోల్ చేశా. సమంత క్యారెక్టర్, నా క్యారెక్టర్ మధ్య ఉన్న సంబంధం, మా కథలు ఆసక్తిగా ఉంటాయి.
ఛాలెంజింగ్‌గా అనిపించింది…
సినిమాలో సమంతలా నేను ఫైట్స్ ఏమీ చేయలేదు. నటిగా మంచి క్యారెక్టర్ చేశాను. ఒక డిఫరెంట్ రోల్ చేసేటప్పుడు నన్ను నేను ఛాలెంజ్ చేసుకుంటా. ఆ విధంగా ఛాలెంజింగ్‌గా అనిపించింది.
నాది సెకండ్ లీడ్…
సమంతతో పాటు నా క్యారెక్టర్ కూడా సమాంతరంగా ఉంటుంది. సినిమాలో లీడ్ రోల్ సమంత చేశారు. ఆమెకు ఒకరు అవసరం అవుతారు. అప్పుడు నా క్యారెక్టర్ ప్రవేశిస్తుంది. రెండు కథలు జరుగుతాయి. ఆ రెండూ ఎలా కలిశాయి? అనేది సినిమా. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. నాది సెకండ్ లీడ్ అని చెప్పవచ్చు.
చాలా రీసెర్చ్ చేశారు…
దర్శకులు హరి, హరీష్ ఇద్దరూ చాలా ప్రశాంతంగా ఉంటారు. వాళ్ళిద్దరూ అరవడం ఎప్పుడూ చూడలేదు. వాళ్ళకు ఏం కావాలో బాగా తెలుసు. ఒక్కో క్యారెక్టర్ కోసం చాలా రీసెర్చ్ చేశారు.
ఫిక్షనల్ స్టోరీ…
సరోగసీ కాంప్లికేటెడ్ ఏమీ కాదు. కొంతమంది యాక్టర్స్ సరోగసీని ఆశ్రయించడం వల్ల చర్చలు జరుగుతున్నాయి. పిల్లలు లేని చాలా మందికి సరోగసీ ద్వారా పొందే అవకాశం కలుగుతోంది. ఈ కథలో సరోగసీ ఒక టాపిక్ అంతే! అందులో మంచి, చెడుల గురించి చెప్పడం లేదు. ఇది ఫిక్షనల్ స్టోరీ.
కథే హీరో…
సినిమాలో యశోద పాత్ర చాలా బలమైనది. ఈ పాత్ర కోసం సమంత చాలా కష్టపడ్డారు. క్యారెక్టర్స్ కంటే కథే నా ఫేవరెట్. ‘యశోద’లో కథే హీరో. మేమంతా ఆ కథలో పాత్రధారులు మాత్రమే. సమంత తన పాత్రలో జీవించింది. పవర్‌ఫుల్ రోల్ బాగా చేసింది.
తదుపరి చిత్రాలు…
తెలుగులో ‘శబరి’ చేస్తున్నా. అందులో నాది లీడ్ రోల్. ‘వీర సింహా రెడ్డి’లో నాది క్రేజీ క్యారెక్టర్. ఇంకొన్ని సినిమాలు ఉన్నాయి.

Varalaxmi Sarathkumar interview about ‘Yashoda’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News