Monday, December 23, 2024

వీడియోలు ‘వస్తున్నాయ్’!

- Advertisement -
- Advertisement -

నేడో.. రేపో విడుదల

ఎంఎల్‌ఎ కొనుగోలు వ్యవహారంలో వెలుగులోకి రానున్న మరిన్ని
సంచలనాలు ఎడిట్ చేయకుండా బయటపెట్టాలని ఎంఎల్‌ఎల
యోచన పార్టీ ఫిరాయించాలంటూ ఒత్తిళ్లు పెరగడంతోనే
ఆడియో, వీడియోల రికార్డు కమలం వికృత చేష్టలను
దేశానికి ఫామ్‌హౌస్
ఇది ట్రయల్ మాత్రమే.. ముందుంది అసలు సినిమా: కెటిఆర్

ఆడియోలతోనే దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎల కొనుగోలు వ్యవహారంలో మరిన్ని సంచలనాలు దేశ ప్రజల ముందుకు రానున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలను త్వరలో విడుదల చేయాలని టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు భావిస్తున్నారు. ఇందులో బిజెపి ప్రమేయాన్ని రుజువు చేసే బలమైన ఆధారాలు ఉంటాయని అంటున్నారు. ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చే కమలనాథుల కుతంత్రాలను బయటపెట్టడానికే ఈ తతంగాన్ని రికార్డు చేసినట్లు చెబుతున్నారు.

మన తెలంగాణ/హైదరాబాద్ :దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టి.ఆర్.ఎస్. పార్టీ ఎంఎల్‌ఎల కొనుగోళ్ల వ్యవహారానికి సంబంధించిన వీడియోలు కూడా విడుదల కానున్నాయ ని తెలిసింది. జాతీయస్థాయిలో రాజకీయంగా ప్ర కంపనలు సృష్టించిన ఎంఎల్‌ఎల బేరసారాలకు సంబంధించిన రెండు ఆడియో రికార్డులు భారతీ య జనతా పార్టీ పెద్దల బండారాన్ని బట్టబయలు చేయగా దానికి మరింత ఊతమిచ్చే విధంగా వీడియోలను కూడా బయటపెట్టేందుకు ఆ ఎంఎల్‌ఎలకు సంబంధించిన అనుచరులు ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. అంతేగాక మంత్రి కెటిఆర్ శనివారం ఒక టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూ లో ‘అసలు సినిమా ముందుంది’ అని చెప్పడంతో వీడియోల విడుదలకు రంగం సిద్ధమయ్యిందనడానికి మరింత బలం చేకూరింది. ఈ వీడియాల్లో జ నరల్ ఆడియో కూడా రికార్డయ్యిందని, కొన్ని మా టలు కూడా వినిపిస్తాయని ఎంఎల్‌ఎ రోహిత్‌రెడ్డి అనుచరులు పక్కా స్కెచ్‌తోనే బిజెపి ప్రతినిధులుగా ఫామ్‌హౌస్‌కు వచ్చిన వారి బండారాన్ని రికార్డు చేశారని కొందరు నాయకులు వివరించా రు.

ఎందుకంటే గత కొన్ని రోజులుగా బిజెపిలో చేరాలని ఒత్తిడి చేశారని, ఈ ఒత్తిళ్లు భరించలేకనే ఎంఎల్‌ఎలు రోహిత్‌రెడ్డి, గువ్వల బాలరాజు, హ ర్షవర్ధన్‌రెడ్డి, రేగా కాంతారావుల కూడబలుక్కొని బిజెపి వస్తున్న ఒత్తిళ్లు, బ్లాక్‌మెయిల్ రాజకీయలకు ఎలాగైనా ఫుల్‌స్టాప్ పెట్టాలనే ఉద్దేశ్యంతోనే సాంకేతిక నిపుణుల సహకారంతో పగడ్బందీగా సిసి కెమెరాలు, సీక్రెట్ కెమెరాలు, డిజిటల్ మైక్‌లు తదితర అధునాతన టెక్నాలజినీ వినియోగించుకొని బిజెపిపెద్దల కుట్రలను బహిర్గతం చే యాలనే పట్టుదలతోనే ముందస్తుగా ఏర్పాట్లు చే సుకొన్నారని తెలిపారు. బిజెపి దూతలు చేసిన ఒ త్తిళ్లు, బ్లాక్‌మెయిల్స్‌తో ఎంఎల్‌ఎ తదితరుల ఇగో హర్ట్ అయ్యిందని, అందుకే బిజెపి బండారాన్ని బట్టబయలు చేయాలని నిశ్చయించుకొన్నారని తెలిపారు. బిజెపి మధ్యవర్తులు గా వచ్చిన నందకుమార్, రామచంద్ర భారతి, సింహయాజులును పోలీసులకు పట్టించాలనే కృతనిశ్చయంతోనే ఆ ఎంఎల్‌ఎలు చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, ఏ ఒక్క సందర్భంలో కూడా ఆ ముగ్గురు మధ్యవర్తులకు ఎలాంటి అనుమానాలు రాకుండా ఎంఎల్‌ఎలు జాగ్రత్తగా వ్యవహరించార ని తెలిపారు.

పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడంతోపాటుగా ఆడియో రికార్డులు కూడా ఇచ్చామని, తాము వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానా న్ని, డిజిటల్ పరికరాలను కూడా పోలీసులకు అం దజేశామని వివరించారు. ఆడియోలను రెండు భా గాలుగా విభజించి మీకు (మీడియా) అందేటట్లు చేశామని, అదే పద్ధతిలో వీడియో రికార్డులను కూ డా విడుదల చేస్తామని ఆ నాయకులు వివరించా రు. ఈ వీడియోలను చూస్తే మరింత స్పష్టంగా బి జెపి దూతల బండారం తెలిసిపోతుందన్నారు. ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశిస్తున్న దగ్గర్నుంచి, వారిని రిసీవ్ చేసుకోవడం, లోపలికి రావడం, పరిచయా లు చేసుకోవడం, కలిసి ముచ్చటించుకోవడం.. వారి బాడీ లాంగ్వేజ్… ఇలా ఒక్కటేమిటీ అన్ని కో ణాల నుంచి బిజెపి మధ్యవర్తుల వ్యవహారమంతా ప్రపంచానికి తెలిసిపోతుందని తెలిపారు. బిజెపి చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ను బట్టబయలు చేసి రాష్ట్రంలోనే కాకుండా దేశం మొత్తానికి కమలం పార్టీ వికృత చేష్టలన్నీ తెలిసేట్లు చేయాలని కంక ణం కట్టుకొన్న ఎంఎల్‌ఎలు ‘ఆపరేషన్ ఫామ్‌హౌస్’ను చేపట్టారని వివరించారు.

అందుకే బిజెపి దూతలు అడ్డంగా దొరికిపోయారని, దీన్నిబట్టి టి ఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంపిల జోలికొస్తే తగిన గు ణపాఠం చెప్పక తప్పదని నిరూపించామని ఆ నా యకులు సగర్వంగా చెబుతున్నారు. వాస్తవానికి మహారాష్ట్ర సిఎం ఏక్‌నాథ్ షిండే తరహా నేతలు తె లంగాణలోనూ ఉన్నారని బిజెపి అగ్రనేతలు బహిరంగంగా చెప్పడం, దానికి అనుబంధంగా కమ లం పార్టీ ఎంఎల్‌ఎ కూడా కొద్దిరోజుల క్రితం ఏయే జిల్లాల నుంచి టిఆర్‌ఎస్ ఎల్‌ఎలు బిజెపిలోకి రాబోతున్నారని చేసిన ముం దస్తు హెచ్చరికతోనే తమ పార్టీ అధిష్టానం అప్రమత్తమయ్యిందని, తమ పార్టీ ఎంఎల్‌ఎలు, ఎంపిలు కూడా అలర్ట్ అయ్యారని వెల్లడించారు. కానీ ఢి ల్లీని ఏలుతున్న బిజెపి వారికున్న ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ‘ఆపరేషన్ ఫామ్‌హౌస్’ను గుర్తించలేకపోయాయని సగర్వంగా చెబుతున్నా రు. డబ్బు, అధికార బలంతో బిజెపియేతర రాష్ట్రా ల్లో ప్రజా ప్రభుత్వాలను కూల్చడం, పార్టీల్లో చిచ్చుపెట్టి విభజించి పాలించు సూత్రాన్ని అమలుచేస్తూ రాజకీయాలను బిజెపి నేతలు భ్రష్టు అందుకే కమలం పార్టీ ఆగడాలు, అరాచకాలకు ఎక్కడో ఒకచోట బ్రేకులు వేసేందుకే ఆపరేషన్ ఫా మ్‌హౌస్‌ను చేపట్టాల్సి వచ్చిందని అంటున్నారు. అందుకే ఎంతో స్పష్టంగా రికార్డయిన వీడియోల ను కూడా విడుదల చేయాలని నిర్ణయించుకొన్నామని ఆ నాయకులు వివరించారు.

ఈ వీడియోల ను ఎక్కడా ఎడిట్ చేయడం లేదని, రికార్డయిన విజువల్స్ మొత్తాన్ని యథావిధిగా విడుదల చేస్తామని, కాకుంటే లెంగ్త్ ఎక్కువగా ఉంటున్నాయని, అందుచేతనే ఖాళీగా ఉన్న విజువల్స్‌ను కట్ చేద్దా మా? వద్దా? ఆ ఖాళీ సమయాన్ని కూడా విడుదల చేద్దామా? అని ఆలోచన చేస్తున్నామని తెలిపారు. అయితే పోలీసులకు మాత్రం ఎక్కడా ఒక్క సెకండ్ వీడియోను కూడా కట్ చేయకుండా యథావిధిగా మొత్తం వీడియో రికార్డులను ఇచ్చామని, కాకుం టే మీడియాకు ఇచ్చే సమయంలో ఆ ఖాళీ సమయాన్ని కట్ చేద్దామా? వద్దా? అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఎలాగూ పోలీసులకు పూర్తి వీడియోలను ఇచ్చాం గనుక మీడియాకు ఖాళీ టైం వీడియోను కట్ చేసి మిగతా మొత్తం వీడియోను విడుదల చేస్తేనే మంచిదనే అ భిప్రాయంతో ఉన్నామని ఆ నాయకులు వివరించారు. ఇక వీడియోలో ఎలాంటి దృశ్యాలు నిక్షిప్త మై ఉన్నాయో, అదనపు సమాచారం ఉం దో వీడియో రికార్డులతో బిజెపి దూతలు, వారి వెనుక ఉన్న పెద్దల ప్రమేయంపై ఎలాంటి సమాచారం దొరుకుతుందో చూడాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News